Nutrients
Nutrients : పౌష్టికాహారం తోనే శరీరానికి ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఆహార విషయంలో ప్రత్యేకత శ్రద్ధ చూపించారు. ఎందుకంటే పౌష్టికాహారం ఎక్కువ ధరతో కలిగి ఉంటాయి కాబట్టి వాటిని చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. అయితే మనకు రోజు ఎదురయ్యే లేదా మార్కెట్లో కనిపించే ఆహార పదార్థాల్లోనూ అనేక రకాల ప్రోటీన్లు అధికంగా ఉండేవి ఉన్నాయి. కానీ వాటిని మనం రెగ్యులర్ గా తీసుకోకుండా ఉండటం వల్ల ఎన్నో రకాలుగా పోషకాలను మిస్ అవుతున్నాం. అందువల్ల మార్కెట్లో కనిపించే వాటినే క్రమ పద్ధతిలో తీసుకోవడం వల్ల తక్కువ ధరలోనే పౌష్టికాహారాన్ని తీసుకున్న వారవుతారు. అసలు మార్కెట్లో దొరికే తక్కువ ధరలో ఉండే పోషకాహార పదార్థాలు ఏమో చూద్దాం..
మార్కెట్లోకి వెళ్ళగానే కొన్ని సందర్భాల్లో వేరుశనగ కనిపిస్తూ ఉంటుంది. కానీ దీని గురించి పెద్దగా పట్టించుకోం. అయితే వేరుశనగలు అనేక రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఐరన్ లోపం ఉన్నవారు వేరుశనగలను తినడం వల్ల సమస్యను పరిష్కరించుకుంటారు. వీటిని నేరుగా తినడానికి ఇబ్బంది పడేవారు ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకోవడం మంచిది. వారంలో కొన్ని రోజులపాటు అయినా వేరుశనగలను తినే ప్రయత్నం చేయడం వల్ల శరీరానికి పౌష్టికాహారాన్ని అందించిన వారవుతారు.
Also Read : అతిగా తినడం వల్ల గర్బం దాల్చే శక్తి తగ్గుతుందా?
కాలంతో సంబంధం లేకుండా మార్కెట్లో అందుబాటులో ఉండే పండు అరటిపండు. అరటిపండు కొన్ని సందర్భాల్లో ధర అమాంతం పెరుగుతుంది. అయితే తక్కువ ధరలో ఉన్నప్పుడు దీనిని తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అరటి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా లభ్యమవుతుంది. తక్షణ ఎనర్జీ అందించడానికి అరటిపండు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఫిబ్రవరి నెలలో ఎక్కువగా కనిపించే చిలకడ దుంపను కచ్చితంగా తినాలని చెబుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత ఇది ఎక్కువగా మార్కెట్లో కనిపించదు. చిలకడ దుంపలో విటమిన్ ఏ బి సి తోపాటు పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. అందువల్ల ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొందరికి కూరగాయలు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. మాంసాకృతులు అంటే ఎగబడి తింటారు. కానీ వాటికంటే ఎక్కువ పోషకాలు ఉండే పాలకూరను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పౌష్టికాహారం లభిస్తుంది. పాలకూరలో విటమిన్ సి ఏ కె ఉంటాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మెగ్నీషియం కూడా అధికంగా లభించడంతో దీనిని తినడం వల్ల ఆ లోపాన్ని నివారించుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండడంతో దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అధిక ప్రయోజనాలు ఇచ్చిన వారవుతారు.
వీటితోపాటు రెగ్యులర్గా కోడిగుడ్డు కూడా తీసుకుంటూ ఉండాలి. కోడిగుడ్డులో విటమిన్ డి తో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వీలైతే రోజుకు రెండు కోడిగుడ్లు తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్ గా ఉంటారు.
Also Read : మీ గుండె వీక్ అయిందని తెలిపే సంకేతాలు.. పదిలం కావాల్సిందే..