Homeబిజినెస్Skoda Electric Bike: స్కోడా స్లావియా బి.. రెట్రో లుక్‌తో ఫ్యూచర్ టెక్నాలజీ.. సింపుల్గా అదుర్స్...

Skoda Electric Bike: స్కోడా స్లావియా బి.. రెట్రో లుక్‌తో ఫ్యూచర్ టెక్నాలజీ.. సింపుల్గా అదుర్స్ అంతే!

Skoda Electric Bike : కార్ల తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్కోడా (Skoda) ఇప్పుడు మరోసారి తన చరిత్రను గుర్తు చేసుకుంటూ కొత్త లుక్ లో దర్శనమిచ్చింది. కంపెనీ తాజాగా స్లావియా B ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ (Slavia B Electric Cafe Racer) కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది చూడటానికి అద్భుతంగా ఉండటమే కాకుండా.. స్కోడా (Skoda) 125 ఏళ్ల చరిత్రను కూడా కళ్లకు కడుతుంది.

Also Read: రెనాల్ట్ డస్టర్ పేరు ఖరారు.. భారత్‌లో ‘బోరియల్’గా రిలీజ్.. ఫీచర్లు ఇవే!

1899లో లారిన్ & క్లెమెంట్ స్లావియా B పేరుతో 240సీసీ పెట్రోల్ బైక్‌ను రిలీజ్ చేసింది. ఇది యూరప్‌లో తన రేసింగ్ పర్ఫామెన్స్, పవర్ ఫుల్ ఇంజన్ తో పాపులారిటీ సంపాదించింది. తరువాత ఈ బ్రాండ్ స్కోడాలో విలీనమై, కంపెనీ కార్ల తయారీపై దృష్టి సారించింది.కొత్త స్లావియా B (Slavia B) అదే చారిత్రాత్మక బైక్‌కు ఎలక్ట్రిక్ నివాళి. అయితే ఇందులో ఎలక్ట్రిక్ పవర్, ఆధునిక డిజైన్ కలగలిపి ఉన్నాయి.

డిజైన్ ప్రత్యేకతలు ఇవే
* బ్రౌన్ లెదర్ డీటైలింగ్: సీటు, హ్యాండిల్ గ్రిప్స్, ఫుట్‌రెస్ట్ , టూల్ బ్యాగ్ అన్నీ రెట్రో ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి అసలైన బ్రౌన్ లెదర్‌తో తయారు చేశారు.
* ఫ్లోటింగ్ సీటు, లోగో: సీటు, లారిన్ & క్లెమెంట్ లోగో బైక్ ఫ్రేమ్ నుండి గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తాయి. ఇది బైక్‌కు ఒక కళాకండం లాంటి లుక్ ఇస్తుంది.
* లేటెస్ట్ ఫీచర్స్ : USD ఫ్రంట్ ఫోర్క్స్, స్లిక్ టైర్లు, రెక్టాంగులర్ స్పోక్ డిజైన్, షార్ప్ LED హెడ్‌లైట్, DRLలు, ముందు భాగంలో ‘SKODA’ లోగో.
* బైక్ చూడటానికి అద్భుతంగా ఉన్నప్పటికీ, దీని “కేఫ్ రేసర్” లుక్ రైడింగ్ పొజిషన్ కొంచెం అసౌకర్యంగా ఉంది. అంటే ఇది రోడ్డుపై కంటే ఎక్కువగా షో కోసం తయారు చేసినట్లుంది.

లాంచ్ అవుతుందా?
ప్రస్తుతానికి ఈ బైక్‌ను లాంచ్ చేయరు. ఇది ఫ్రెంచ్ డిజైనర్ రోమైన్ బుకాయిల్ రూపొందించిన ప్రత్యేక కాన్సెప్ట్ మోడల్. ఇది మొదట పెన్సిల్ స్కెచ్‌తో ప్రారంభమైంది. తరువాత 3D మోడలింగ్ టూల్స్ సహాయంతో దీనికి తుదిరూపం ఇచ్చారు.

అందులో 240cc, సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 1.75HP పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 40 కిమీ. దీనికి ట్రాన్స్‌మిషన్ లేదా గేర్‌బాక్స్ లేదు. ఇది పెడల్‌తో స్టార్ట్, సపోర్ట్ పొందింది. మొత్తం 540 యూనిట్లు (1899 నుండి 1904 వరకు) ఉత్పత్తి అయ్యాయి. స్కోడా స్లావియా B (Skoda Slavia B) ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కేవలం ఒక బైక్ కాదు. ఇది చరిత్ర, భవిష్యత్తుల కలయికకు ఒక ఉదాహరణ.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular