Mirchi Movie: కానీ కెరియర్ లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే అనుకోకుండా సినిమాలకు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి చాలామంది ముద్దుగుమ్మలు గుడ్ బై చెప్పేసారు. వీళ్ళలో మిర్చి సినిమా హీరోయిన్ కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ నటించిన దాదాపు అన్ని సినిమాలే కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. ఇప్పటికీ కూడా ప్రభాస్ సినిమాలు టీవీల ప్రసారం అవుతుంటే అభిమానులు ఎంతో ఇష్టంగా వీక్షిస్తారు. ఇప్పటివరకు ప్రభాస్ తన కెరియర్ లో నటించిన సినిమాలలో మిర్చి సినిమాకు ప్రత్యేక క్రియేట్ ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ అయింది. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిర్చి సినిమా కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దేవిశ్రీప్రసాద్ మిర్చి సినిమాకు అందించిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో అనుష్క, గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ తల్లిదండ్రులుగా మిర్చి సినిమాలో నదియా, సత్యరాజ్ కీలక పాత్రలలో కనిపించారు. ఇదిలా ఉంటే మిర్చి సినిమాలో హీరోయిన్ గా తన నటనతో రీచాగంగోపాధ్యాయ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత రిచా పేరు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపించింది. దాంతో రిచా కు తెలుగులో అవకాశాలు చుట్టుముట్టాయి.
రిచా గంగోపాధ్యాయ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. లీడర్ సినిమా తోనే రానా దగ్గుబాటి కూడా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే రిచా నటిగా అందరి నుంచి ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడిగా మిర్చి అలాగే రవితేజ కి జోడిగా మిరపకాయ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత రీఛా తెలుగులో నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత రీచా మరొక తెలుగు సినిమాలో కనిపించలేదు. కొన్నాళ్లపాటి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా రిచా 2019లో తన స్నేహితుడు జో లాంగెళ్ల నో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ దంపతులకు 2021లో ఒక బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం రిచా తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతో గడుపుతుంది. హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram