Tollywood: కానీ వాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. తాజాగా ఒకప్పటి తెలుగు హీరోయిన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకప్పుడు ఈ చిన్నది తన అందం, అభినయంతో పలు సినిమాలలో నటించిన కూడా అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా అందం, అభినయం ఉన్నా కూడా సినిమా అవకాశాలు రాక ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కొన్ని సినిమాలలో తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన సపోర్ట్ లేక అవకాశాలు కోల్పోయిన ముద్దుగుమ్మలు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వీళ్లలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు అని చెప్పొచ్చు. హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాలలో నటించిన కూడా ఈమె అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది.
ఇది కూడా చదవండి: సిట్టింగ్ పొజిషన్ లో కూడా ఇంత అందంగా కనిపించవచ్చా?
అయిన కూడా ఈ బ్యూటీ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత తెలుగు నుంచి కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకొని సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ సమయంలోనే కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రయత్నించింది. కానీ అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు. అప్పట్లో ఈ చిన్నది దర్శకుడిని రహస్యంగా పెళ్లి చేసుకొని వార్తల్లో కూడా ఎక్కువగా నిలిచింది. అప్పటి హీరోయిన్లు చాలామంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆ హీరోయిన్లలో పూనమ్ బజ్వా కూడా ఒకరు.
పూనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పూనం నవదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా తో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత పూనం ప్రేమంటే ఇంతే అనే సినిమాలో కూడా తన నటనత ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా కనిపించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాలో కూడా హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు తో పాటు పూనం తమిళ్, కన్నడ మలయాళ భాషలలో కూడా సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత సక్సెస్ మాత్రం కాలేకపోయింది. చివరిగా పూనమ్ తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది.
View this post on Instagram