Prabhas Marriage: హీరో అంటే ఆరడుగుల ఎత్తు బలమైన బాడీ తో రౌడీలను కొడితే ఒకేసారి ముగ్గురు పడిపోయేంత స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి వాళ్లను చూస్తే వారిని ఆటోమేటిగ్గా హీరో అంటే ఇలా ఉండాలి అనే ఒక ఐడియా మనకు వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం ప్రభాస్ లాంటి నటుడైతే ఇంకెవరు ఉండరనేది వాస్తవం. ఇక ఈశ్వర్ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం ప్రపంచ స్థాయి హీరోగా ఎదిగాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఇండియాలో ఇప్పటివరకు ఆయనను మించిన హీరో మరెవరు లేరు. కాబట్టి ఆయన ఇకమీదట కూడా తన పరిధిని మరింత విస్తరింప చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ప్రభాస్ బాహుబలి సినిమా చేయడానికి ముందు తనకు పెళ్లి చెయ్యాలి అనుకున్నప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు అయిన ఐశ్వర్య ను ప్రభాస్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని అర్జున్ భావించాడట.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?
అర్జున్ తెలుగులో కూడా చాలా గొప్ప సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే అర్జున్ సైతం కృష్ణం రాజు తో మంతనాలు జరిపినప్పటికి ప్రభాస్ అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అది అక్కడితోనే ఆగిపోయిందనే వార్తలైతే వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా అర్జున్ ప్రభాస్ లాంటి నటుడిని అల్లుడిగా చేసుకోవాలని భావించడంలో తప్పులేదు.
కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి తను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పేసారట. ఇక ఏది ఏమైనా కూడా ఫ్యూచర్లో అయిన ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే పెళ్లి ప్రస్తావన రావడం లేదు. మరి ఎట్టకేలకు ఆయన ఒక ఇంటి వాడైతే చూడాలని తన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడప్పుడే అది వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదు…
