Renault Boreal: భారతీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెనాల్డ్ డస్టర్ న్యూ ఎడిషన్ ఎట్టకేలకు తన పేరును ఖరారు చేసుకుంది. ఈ SUV 5-సీటర్, 7-సీటర్ వేరియంట్‌లలో విడుదల కానుండగా, 7-సీటర్ వెర్షన్ పేరును కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ వెర్షన్ ఇకపై రెనాల్ట్ బోరియల్ (Renault Boreal)గా రాబోతుంది. ఈ పేరు యూరప్ వెలుపల అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఉంటుందని ఫ్రెంచ్ OEM స్పష్టం చేసింది. అంటే, భారతీయ 7-సీటర్ డస్టర్ కూడా బోరియల్ పేరుతోనే విడుదలయ్యే అవకాశం ఉంది. రెనాల్ట్ 2026 మధ్య నాటికి న్యూ జనరేషన్ డస్టర్ SUVని భారతీయ మార్కెట్లో విడుదల చేయాలని యోచిస్తోంది.
Also Read: అదిరే మైలేజ్ … బూట్ స్పేస్ సూపర్.. డ్యూయల్ CNG సిలిండర్ కార్లు ఇవే!
కొత్త రెనాల్ట్ డస్టర్ ఎక్స్‌టీరియర్‌లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీని ముందు భాగం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో రెనాల్ట్ బ్యాడ్జింగ్‌తో కూడిన గ్రిల్‌ను అమర్చారు. ఇది సాంప్రదాయ రొనాల్టట చిహ్నం స్థానాన్ని తీసుకుంటుంది. ఈ కాస్మెటిక్ మార్పులు ఉన్నప్పటికీ డస్టర్ డైమెన్షన్స్ మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. దీని పొడవు 4343ఎంఎం, వీల్‌బేస్ 2657ఎంఎం.
ఇంటీరియర్ విషయానికి వస్తే, 2025 రెనాల్డ్ డస్టర్ తన రోమేనియన్ కౌంటర్‌పార్ట్ అయిన డాసియా డస్టర్‌కు దగ్గర పోలిక ఉంటుంది. స్టీరింగ్ వీల్ మాత్రమే ఈ రెండింటిని వేరు చేస్తుంది. హై ట్రిమ్‌లో లేటెస్ట్ 7-ఇంచుల వర్చువల్ డాష్‌బోర్డ్, 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్‌ను అందించారు. ఇది ఫ్రంట్ ప్యానెల్ పైకి ఉంటుంది. టాబ్లెట్, సెంటర్ కన్సోల్ డ్రైవర్-సెంట్రిక్ డ్రైవింగ్ అనుభవాన్ని మరిచిపోలేనిదిగా చేస్తాయి.
టర్కీ మార్కెట్‌లో 2025 రెనాల్ట్ డస్టర్ వివిధ అవసరాలను తీర్చడానికి అనేక రకాల ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో మూడు-సిలిండర్ 1.0 TCe ఇంజన్ ఉంది, ఇది 100 hp పవర్ అందిస్తుంది. పెట్రోల్ ఆధారంగా నడుస్తుంది. అదనంగా, 1.2 TCe గ్యాసోలిన్ టర్బో 3 సిలిండర్ ఇంజన్‌తో కూడిన మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ ఉంటుంది. ఇది 130 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రత్యేకంగా ఆల్-వీల్ డ్రైవ్‌ను అందించే 48-వోల్ట్ స్టార్టర్-జనరేటర్‌తో అందుబాటులోకి రాబోతుంది. టాప్ రేంజ్‌లో నాలుగు-సిలిండర్ 1.6 ఇంజన్, ఒక ఎలక్ట్రిక్ మోటర్‌తో కూడిన ఇ-టెక్ హైబ్రిడ్ వేరియంట్ ఉంటుంది. ఇది 140 hp అవుట్‌పుట్‌ను అందిస్తుంది.