spot_img
Homeఅంతర్జాతీయంNorth Korea Election Results 2026: ఉత్తర కొరియా ఎన్నికలు.. కిమ్‌కు 99.93% ఓట్లు.. మరి...

North Korea Election Results 2026: ఉత్తర కొరియా ఎన్నికలు.. కిమ్‌కు 99.93% ఓట్లు.. మరి 0.07 శాతం ఓట్లు ఏమైనట్లు?

North Korea Election Results 2026: ఉత్తరకొరియా.. ఈ దేశం పేరు వినగానే అమెరికా వణికిపోతుంది. ఇక ప్రపంచానికి గుర్తుకువచ్చే నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌. దశాబ్దాలుగా ఆయనే ఉత్తరకొరియా అధ్యక్షుడిగా ఉంటున్నాడు. నియంత్రృత్వ పాలన సాగిస్తున్నాడు. అయినా అగ్రరాజ్యం అమెరికా ఆ దేశంలో జోక్యం చేసుకోదు. చిన్న చిన్న దేశాలపై మాత్రం యుద్ధాలు ప్రకటిస్తుంది. ఈ నియంత దేశంలో తాజాగా ఎన్నికలు జరిగాయి. ఇందులో
కిమ్‌ జాంగ్‌–ఉన్‌ నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు 99.93% ఓట్లు లభించాయి. మిగిలిన 0.07% ఓట్లు ప్రశ్నార్థకంగా మిగిలాయి. ఈ ఫలితాలు దేశ శాసనసభకు సంబంధించినవి, ప్రతి పౌరుడు ఒకే అభ్యర్థికి ఓటు వేయాల్సిన వ్యవస్థలో జరిగాయి.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?

ఉత్తర కొరియా ఎన్నికల వ్యవస్థ..
ఉత్తర కొరియాలో ఎన్నికలు పోటీ లేనివి. ఒకే పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారు. ప్రతీ ఓటరు పేరు, ఓటు సమయం రికార్డు చేయబడుతుంది. ఈ ప్రక్రియ అధికారికంగా ’ప్రజాస్వామ్య’గా పిలువబడుతుంది, కానీ అంతర్జాతీయంగా దాన్ని నియంతృత్వంగా విమర్శిస్తారు.

0.07% ఓట్ల రహస్యం ఇదే..
ఒకే వ్యక్తి పోటీచేసి.. ఒకే వ్యక్తికి ఓట్లు వేసినప్పుడు ఈ ఎన్నికల్లో 0.07 శాతం ఓట్లు ఎవరిక పడ్డాయన్న సందేహం కలుగుతుందా.. ఇవి టెక్నికల్‌ లోపాలు, లెక్క పొరపాట్లు లేదా అధికారికంగా ‘అసంపూర్ణ’ ఓట్ల వల్ల లెక్కించలేదు. పూర్తి 100% రాకపోవడం కూడా ప్రభుత్వం ’సంపూర్ణ సమర్థన’ చూపించేందుకు వదిలేసినట్లు కూడా భావిస్తున్నారు. వాస్తవ ఓట్లు లేకపోవడం వల్ల ఈ లెక్కలు మాత్రమే ఆసక్తి రేకెత్తిస్తాయి.

ఈ ‘విజయం’ కిమ్‌ కుటుంబ ఆధిపత్యాన్ని బలపరుస్తుంది. దేశంలో వ్యతిరేకత లేకపోవటం, ప్రచార మాధ్యమాల ద్వారా సమర్థనను ప్రదర్శించడం స్వభావం. అంతర్జాతీయంగా ఇది మానవ హక్కులు, ప్రజాస్వామ్య లోపాలపై చర్చలకు దారి తీస్తుంది. ఈ ఫలితాలు ఉత్తర కొరియా ఒంటరితనాన్ని చూపిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular