SBI: వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ.. కొత్తవి ఎలా ఉన్నాయంటే?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో రూ.2 కోట్ల రిటైల్ ఫిక్స్ డ్ ను 46 రోజుల నుంచి 179 రోజుల వరకు చేస్తే అత్యధికంగా 75 బేసిస్ పాయింట్ల వడ్డీని పెంచింది.

Written By: Chai Muchhata, Updated On : May 15, 2024 3:07 pm

SBI Interest Rates Hike

Follow us on

SBI: దేశంలోని బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేటేస్ట్ గా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బ్యాంకులో డిపాజిట్లు చేసుకునేవారికి ఇక అధిక ప్రయోజనం కలగనుంది. ఎందుకంటే రూ.2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై, ఆ పైన బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ సవరణలో మే 15 బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. బ్యాంకు వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో రూ.2 కోట్ల రిటైల్ ఫిక్స్ డ్ ను 46 రోజుల నుంచి 179 రోజుల వరకు చేస్తే అత్యధికంగా 75 బేసిస్ పాయింట్ల వడ్డీని పెంచింది. సాధారణ కస్టమర్లకు 4.75 శాతం నుంచి 5.50 శాతానికి రేటు పెరుగుతుంది. సీనియర్ సిటీజన్ల టెన్యూర్ పై 5.25 నుంచి 6 శాతానికి పెంచింది.

ఇదే రిటైల్ డిపాజిట్ 180 రోజుల నుంచి 210 రోజుల వరకు డిపాజిట్ చేస్తే వాటిపై 6 శాతినికి పెంచింది. 211 నుంచి ఏడాదిలోపు ఉండే డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లను ఎస్బీఐ సవరణ చేసింది. ఈ టెన్యూర్ కారణంగా జనరల్ కస్టమర్లకు 6.25 శాతం వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటీజన్లకు 6.75 వరకు వడ్డీ రానుంది.

రూ.2 కోట్ల బల్క్ డిపాజిట్ల విషయాన్ని పరిశీలిస్తే 7 నుంచి 45 రోజుల పాటు టెన్యూర్ పై 5.25 నుంచి 5.75 శాతానికి వడ్డీ రేటు పెంచింది. 46 నుంచి 179 రోజుల వరకు టెన్యూర్ వారికి 50 బేసిస్ పాయింట్లను పెంచి6.25 శాతం వరకు వడ్డీ ఇవ్వనున్నారు. సీనియర్ సిటిజన్ల కు 6.25 నుంచి 6.75 శాతానికి వడ్డీ చెల్లించనున్నారు.

ఏడాదిపాటు టెన్యూర్ వారికి 20 బేసిస్ పాయింట్ల పెంచి జనరల్ కస్టమర్లకు 6.80 శాతానికి వడ్డీ ఇవ్వనున్నారు. 2 నుంచి 3 సంవత్సరాల వారికి 6.75 నుంచి 7 శాతానికి వడ్డీని, సీనియర్లకు 7.25 నుంచి 7.50 శాతం వడ్డీ చెల్లించే అవకాశం ఉంది.