https://oktelugu.com/

ఈ కారుపై రూ.1.5 లక్షల డిస్కౌంట్.. వెంటనే త్వరపడండి..

స్కోడా కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్కోడా కుషక్ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఎస్ యూవీ మోడల్ అయిన దీనిని మార్కెట్లో 11.99 నుంచి 20.49 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారుపై రూ1.25 లక్షల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 15, 2024 / 03:10 PM IST

    Skoda Car

    Follow us on

    కార్ల మార్కెట్లో స్కోడా కంపెనీకి ప్రత్యేక పేరు ఉంది. 100కు పైగా దేశాల్లో ఉన్న ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. స్కోడా నుంచి వచ్చిన ప్రతీ కారు ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తాజాగా స్కోడా కంపెనీ కారు వాడే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీకి చెందిన కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అయితే కాంప్లిమెంటరీ 3 ఇయర్స్, 45 వేల కిలోమీటర్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఏయే కార్లపై ఎలాంటి తగ్గింపులు ఉన్నాయో చూద్దాం..

    స్కోడా కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్కోడా కుషక్ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఎస్ యూవీ మోడల్ అయిన దీనిని మార్కెట్లో 11.99 నుంచి 20.49 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారుపై రూ1.25 లక్షల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. కుషాక్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభించనుంది. 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు కలిగిన ఈ మోడల్ కు సంబంధించిన డిస్కౌంట్ ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది.

    స్కోడా స్లోవియా ధర మార్కెట్లో 11.63 లక్షల నుంచి రూ.19.12 లక్షల వరకు విక్రయించనున్నారు. దేశీయ మార్కెట్లో స్లావియాకు మంచి పేరు ఉంది. అయినా దీని కొనుగోలుపై 1.5 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. సూపర్ డిజైన్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్న స్లావియాపై భారీ డిస్కౌంట్ తో రానుంది. త్వరలో మార్కట్లోకి స్కోడా కుషాక్,స్లావియాలు ఫేస్ లిప్ట్ లు రాబోతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న వాటిపై డిస్కౌంట్లు ప్రకటించడం ఆకర్షణీయంగా మారింది.