https://oktelugu.com/

మార్కెట్లోకి రాబోతున్న కొత్త SUVలు ఇవే..

భారత కార్ల మార్కెట్లో కియా కార్లు దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షించాయి. లేటేస్టుగా కియా నుంచి సిరోస్ లేదా క్లావిస్ ఎస్ యూవీ రాబోతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 15, 2024 / 02:32 PM IST

    Hyundai Creta Compact Suv

    Follow us on

    కార్లు కొనాలనుకునే వారు ఎక్కువ శాతం SUV వేరియంట్ ను కోరుకుంటున్నారు. మిగతా కార్ల కంటే ఇవి విశాలమైన స్పేస్ తో పాటు ఇంజిన్ విషయంలో ప్రత్యేక ఆకర్షణ ఉండడంతో వీటిపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే బెస్ట్ ఫీచర్స్ తో పాటు అదనపు హంగులు ఉండడంతో వీటి ధర ఎక్కువగానే ఉంటాయి. కానీ లేటేస్ట్ గా కొన్ని ఎస్ యూవీలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇవి మంచి ఫీచర్స్ కలిగి ఉండే అవకాశాలు ఉంటాన్న చర్చ సాగుతోంది. అయితే ఆ కార్లు ఏవో ఒకసారి చూద్దాం..

    భారత కార్ల మార్కెట్లో కియా కార్లు దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షించాయి. లేటేస్టుగా కియా నుంచి సిరోస్ లేదా క్లావిస్ ఎస్ యూవీ రాబోతుంది. ఇందులో ఎల్ ఈడీ ల్యాంప్స్ పొడవైన స్టాన్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా పంచ్, గ్రాండ్ ఐ 10 కి పోటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

    టాప్ 2 లో టాటా కంపెనీ దూసుకుపోతుంది. టాటా నుంచి త్వరలో నెక్సాన్ సీఎన్ జీ రాబోతుంది. దేశంలోనే మొట్టమొదటి టర్బో చార్జ్ కారుగా నెక్సాన్ నిలవబోతుంది. ఈ వెర్షన్ డిజైన్ ఐసీఈ మోడల్ ను పోలి ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త నెక్సాన్ మార్కెట్లోకి రాబోతుంది. మరో కారు నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్ వెర్షన్ తో రాబోతుంది. సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ ఇప్పటికే అందుబాటులో ఉన్న నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.

    హ్యుందాయ్ నుంచి ఎస్ యూవీ కార్లు ఇప్పటికే చాలా వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా వెన్యూను తీసుకురాబోతున్నారు. పాత వెన్యూ నుంచి కొన్ని మార్పులు చేసి 2025లో పరిచయం చేయనున్నారు. ఈ మోడల్ ఎక్స్ టీరియర్ కంటే ఇంటీరియర్ డిజైన్ లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

    స్కోడా నుంచి కొత్త ఎస్ యూవీ వోక్స్ వ్యాగన్ రాబోతుంది. 2025 నాటికి ఇది మార్కెట్లోకి రావొచ్చు. ప్రస్తుతం దీనిని వివిధ రకాలుగా పరీక్షిస్తున్నారు. వచ్చే ఏడాదిలోమొబిలిటీ షో లో ప్రదర్శించనున్నారు. సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీగా రాబోతున్న ఈ కారు గురించి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.