Homeబిజినెస్Redmi Turbo 5 new smartphone launch: Redmi నుంచి కొత్త ఫోన్.. వీరికి చాలా...

Redmi Turbo 5 new smartphone launch: Redmi నుంచి కొత్త ఫోన్.. వీరికి చాలా యూజ్ ఫుల్..

Redmi Turbo 5 new smartphone launch: మిడిల్ క్లాస్ పీపుల్స్ మొబైల్ కొనాలని అనుకుంటే Redmi కంపెనీ వైపు ఎక్కువగా చూస్తారు. కస్టమర్స్ కు అనుగుణంగా ఈ కంపెనీ లేటెస్ట్ గా Turbo 5 అనే మొబైల్ ను తీసుకురాబోతుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఇది జూన్ 2026 తొలి వారంలో లేదా జూన్ 10, 2026 నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ […]

Redmi Turbo 5 new smartphone launch: మిడిల్ క్లాస్ పీపుల్స్ మొబైల్ కొనాలని అనుకుంటే Redmi కంపెనీ వైపు ఎక్కువగా చూస్తారు. కస్టమర్స్ కు అనుగుణంగా ఈ కంపెనీ లేటెస్ట్ గా Turbo 5 అనే మొబైల్ ను తీసుకురాబోతుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఇది జూన్ 2026 తొలి వారంలో లేదా జూన్ 10, 2026 నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

రెడ్ మీ టర్బో 5లో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8500 Ultra chip ఉండవచ్చని అంచనా. అలాగే ఈ మొబైల్ కు 12 జీబీ నుంచి 16 జీబీ వరకు RAM ఉండే అవకాశం ఉంది. అలాగే 256GB లేదా 512GB స్టోరేజ్ ఉండనుంది. ఇందులో HyperOS 3 ఆధారిత Android 16 మీద పనిచేయొచ్చని తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో 7,560mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. రెడ్ మీ సెగ్మెంట్‌లో ఇది చాలా పెద్దది. ఈ బ్యాటరీకి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్ లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా రావచ్చని లీక్‌లు చెబుతున్నాయి. ఈ కొత్త మొబైల్ లో కెమెరా సెటప్‌లో భాగంగా 50MP Sony IMX 882 ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉండనుంది. 20MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని రిపోర్టులు ఉన్నాయి. చైనా వెర్షన్‌లో 50MP + 8MP రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా flat back, separate dual camera rings, metal frame, glass back, and Redmi branding ఉండే అవకాశం ఉంది.లీక్‌ల ప్రకారం.. 12GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ.27,999, 16GB + 512GB variant ధర సుమారు రూ . 36,999గా ఉండొచ్చు.

బడ్జెట్ లో మొబైల్ కొనాలని అనుకునేవారికి ఈ ఫోన్ బాగా యూజ్ ఫుల్ అయ్యే అవకాశం ఉంది. రోజూ వారీ వినియోగదారులు ఇప్పుడు ఈ రేంజ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో రెడ్ మీ తీసుకొచ్చే ఈ మొబైల్ ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper