Homeబిజినెస్Realme Narzo 100 Lite 5G: రియల్ మీ నార్జో.. ధరలు, ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్...

Realme Narzo 100 Lite 5G: రియల్ మీ నార్జో.. ధరలు, ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

Realme Narzo 100 Lite 5G: ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు రియల్ మీ నార్జో అని పేరు పెట్టింది. ఇందులో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. 4 జి బి రామ్+ 64 జిబి, 4 జి బి రామ్ +128 జీబీ, 6 జిబి రామ్+ 128 జీబీ అంతర్గత సామర్థ్యంతో కలిగి ఉన్న మూడు మోడల్స్ ను […]

Realme Narzo 100 Lite 5G: ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు రియల్ మీ నార్జో అని పేరు పెట్టింది. ఇందులో మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. 4 జి బి రామ్+ 64 జిబి, 4 జి బి రామ్ +128 జీబీ, 6 జిబి రామ్+ 128 జీబీ అంతర్గత సామర్థ్యంతో కలిగి ఉన్న మూడు మోడల్స్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.. లాంచ్ ఆఫర్లో భాగంగా ప్రతి మోడల్ మీద 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుందని ప్రకటించింది.

భారత మార్కెట్లో రియల్ మీ నార్జో ఏప్రిల్ 21 నుంచి అందుబాటులో ఉంటుంది.. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఈ మోడల్స్ అందుబాటులో ఉన్నాయని రియల్ మీ ప్రకటించింది. ఆయా బ్యాంకుల క్రెడిట్ కార్డుల మీద డిస్కౌంట్ లభిస్తుందని రియల్ మీ ప్రకటించింది.

రియల్ మీ నార్జో 100 లైట్ 5 జీ వేరియెంట్లో అనేక రకాల హైలెట్స్ ఉన్నాయి. 6.8 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే ఉంది. మీడియా టెక్ డైమన్ సిటీ, 6300 చిప్సెట్, 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, ఫైవ్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 7000 ఎంహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్ చార్జింగ్ సపోర్ట్ రివర్స్ బైపాస్ చార్జింగ్ సపోర్ట్, 70 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ ఇటువంటి సదుపాయాలు ఈ మోడల్ లో ఉన్నాయి.

ధరల శ్రేణి ఇలా

4 జి బి రామ్+ 64 జిబి ఇంటర్నల్ సపోర్ట్ కలిగి ఉన్న మోడల్ 13,499, 4జి బి రామ్+128 జీబీ ఇంటర్నల్ సపోర్ట్ కలిగిన మోడల్ 14,499, 6 జి బి రామ్+ 128 జీబీ ఇంటర్నల్ సపోర్ట్ కలిగి ఉన్న మోడల్ ధర 16,499 లో లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్ లో భాగంగా ఇది 1500 డిస్కౌంట్ మీద లభిస్తుంది.

మిడిల్ క్లాస్ యూజర్ లను దృష్టిలో పెట్టుకొని రియల్ మీ కంపెనీ ఈ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ముఖ్యంగా కెమెరా విషయంలో అత్యాధునిక సదుపాయాలను కల్పించింది. బ్యాటరీ విషయంలో కూడా అదే ధోరణి కొనసాగించింది. భారతదేశంలో బలమైన మార్కెట్ ను పెంచుకోవడానికి రియల్ మీ ఈ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper