One Plus : మీరు వన్‌ప్లస్ ఫోన్ వాడుతున్నారా? లేదా కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ వన్‌ప్లస్ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్‌ల డిస్‌ప్లేపై వినియోగదారులకు లైఫ్ టైం వారంటీని అందిస్తోంది. వన్‌ప్లస్ మొబైల్స్‌లో చాలా మంది గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొన్న విషయం గుర్తుండే ఉంటుంది. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో కంపెనీ పాత వినియోగదారులకు ఈ సమస్య నుంచి విముక్తి కలిగించడమే కాకుండా, ఇప్పుడు తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు కూడా లైఫ్ టైం వారంటీని అందిస్తోంది.
Also Read : వన్ ప్లస్ ఫోన్ వాడుతున్నారా..ఐతే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
లేటెస్ట్ టెక్నాలజీ, అమోలెడ్ స్క్రీన్‌లతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో గ్రీన్ లైన్ సమస్య ఎక్కువగా కనిపించింది. తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన వారికి కూడా లైఫ్ టైం డిస్‌ప్లే వారంటీని అందిస్తున్న మొదటి కంపెనీ వన్‌ప్లస్. వినియోగదారుల సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంది. ఈ ఫెసిలిటీ కొత్త, పాత వినియోగదారులకు ఇద్దరికీ వర్తిస్తుంది. కంపెనీ తీసుకున్న ఈ చర్య ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద ముందడుగు.
గ్రీన్ లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన తర్వాత ప్రజల్లో కంపెనీపై మళ్లీ నమ్మకం మరింత పెరిగింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్‌తో పాటు ఈ విషయం స్పష్టంగా తెలియజేసింది. అయితే, ప్రస్తుతం టాబ్లెట్‌లకు మాత్రం లైఫ్ టైం డిస్‌ప్లే వారంటీ ప్రయోజనం లిస్టులో లేదు.
ఈ లైఫ్ టైం వారంటీ ప్రయోజనం కేవలం ఫోన్ డిస్‌ప్లే పార్ట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇది కేవలం గ్రీన్ లైన్ సమస్యకు మాత్రమే పరిమితం. అంటే మీరు వన్‌ప్లస్ కంపెనీ ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత మీకు గ్రీన్ లైన్ సమస్య వస్తే, కంపెనీ మీ ఫోన్‌ను ఉచితంగా రిపేర్ చేస్తుంది. ఈ పని కోసం కంపెనీ మీ నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు.
Also Read : అదిరిపోయే కెమెరా, భారీ బ్యాటరీతో వన్ ప్లస్ 13ఎస్.. లీకైన ఫీచర్లు ఇవే!