Homeక్రీడలుక్రికెట్‌Shikhar Dhawan: రక్తం ఉడికి పోతోంది.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నా: శిఖర్ ధావన్

Shikhar Dhawan: రక్తం ఉడికి పోతోంది.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నా: శిఖర్ ధావన్

Shikhar Dhawan: శిఖర్ ధావన్ బలమైన ఆటగాడు. భీకరమైన బ్యాటింగ్ చేసే మొనగాడు. అందువల్లే అతడిని టీమిండియాలో గబ్బర్ అని పిలుస్తుంటారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే శిఖర్ ధావన్ వ్యవహరిస్తుంటాడు. ఏమాత్రం భయం అనేది ప్రదర్శించడు. ఎదుటివారికి లొంగే ప్రసక్తే లేదని చెబుతుంటాడు. అందువల్లే అతడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి ఆయేషా ముఖర్జీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఆమెతో విడాకులు తీసుకొని తీవ్ర వేదన అనుభవించినా.. ఇలా ప్రతి సందర్భంలోనూ శిఖర్ ధావన్ తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు..తన కొడుకుతో మాట్లాడనివ్వడం లేదని శిఖర్ ధావన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఐర్లాండ్ దేశానికి చెందిన ఓ యువత లివ్ ఇన్ రిలేషన్ లో శిఖర్ ఉన్నాడని.. ఆమెతో కలిసి తిరుగుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే శిఖర్ వ్యవహార శైలి కూడా ఉండడం విశేషం.

 

Also Read:  యజువేంద్ర చాహల్ “తీన్ మార్”.. ధనశ్రీ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డట్టేనా..

 

పహల్గామ్ దాడి తర్వాత..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత శిఖర్ తనదైన శైలిలో స్పందించాడు. ఆ దాడి తర్వాత భారత ఆర్మీపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అనుచితంగా వ్యాఖ్యలు చేయడంతో.. శిఖర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” ఇంకా కిందికి పడిపోవడానికి సిగ్గు అనిపించడం లేదా.. కార్గిల్ యుద్ధంలో వెన్ను చూపించారు. నాడు తలవంచారు.. ఇంకా ఎందుకీ పరుష వ్యాఖ్యలు.. ఇలాంటి మాటలు అనడానికంటే ముందు.. ముందు మీ దేశాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని” ధావాన్ వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా శిఖర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. “పహల్గామ్ దాడి నన్ను తీవ్రంగా బాధించింది. సగటు భారతీయుడు తీవ్రంగా మదన పడుతున్నాడు. దాదాపు 26 మందిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. ఇటువంటి ఘోరం గతంలో ఎన్నడూ చూడలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. భారత ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఇప్పటికే ఈ దిశగా ఆలోచించి ఉంటుందని అనుకుంటున్నాను. ఆ ఘటన జరిగిన తర్వాత తన రక్తం ఉడికిపోతుంది.. ఇలాంటి సందర్భంలో నన్ను ఎవరు అపినా నేను ఆగలేను. నన్ను నేను నియంత్రించుకోలేనని” శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు.. ” ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలి. భారత సైన్యం పకడ్బందీగా వ్యవహరించాలి. ప్రభుత్వం వారికి మరింత స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పటికే ప్రధాని సైన్యానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. బహుశా మన మీద దాడికి పాల్పడిన వారికి చెడ్డ రోజులు మొదలయ్యాయని” శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. శిఖర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఉగ్రదాడిపై భారత క్రికెటర్లు.. ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version