Nissan Kicks : నిస్సాన్ కంపెనీ ఇండియాలో ప్రధానంగా కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో కార్లను విక్రయిస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ ఈ కంపెనీ నుంచి పాపులర్ మోడల్. ఇది మన దేశ మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేస్తుంది. నిస్సాన్, భారతదేశం నుంచి ఇతర దేశాలకు కూడా కార్లను ఎగుమతి చేస్తుంది. నిస్సాన్ ఇండియా మార్కెట్లో తన ఉనికిని పెంచుకోవడానికి హైబ్రిడ్, CNG, ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తోంది.
Also Read : టెస్టింగ్ సమయంలో కెమెరా కంట పడ్డ మారుతి నయా మోడల్స్ ఇవే
నిస్సాన్ కార్లు ఇండియాలోని ఆటోమొబైల్ మార్కెట్లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కంపెనీ భవిష్యత్తులో కూడా ఈ మార్కెట్‌లో వృద్ధి చెందాలని భావిస్తోంది ఈ క్రమంలోనే కొత్త కార్లను తెస్తోంది. ఇప్పటికే కొన్ని కార్లు టెస్టింగులో ఉన్నాయి. నిస్సాన్ కంపెనీ తన కిక్స్ SUV కారుతో క్రాష్ టెస్టింగ్ లో సత్తా చాటింది. NCAP క్రాష్ టెస్ట్‌లో నిస్సాన్ కిక్స్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఈ కారు సేఫ్టీ ప్రమాణాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంది.
నిస్సాన్ కిక్స్ క్రాష్ టెస్ట్‌లో కేవలం 5 స్టార్ రేటింగ్ మాత్రమే కాకుండా, అద్భుతమైన స్కోర్‌ను కూడా సాధించింది. వయోజన ప్రయాణికుల రక్షణలో 90శాతం, పిల్లల రక్షణలో 92శాతం,
సేఫ్టీ అసిస్టెన్స్ సిస్టమ్ లో 85శాతం స్కోర్ చేసింది. ఈ స్కోర్‌లు నిస్సాన్ కిక్స్ భద్రతా ప్రమాణాల్లో ఎంత ముందుందో తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవర్, ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
డ్రైవర్ తల రక్షణ, మెడ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కారుకు మంచి రేటింగ్ లభించింది. డ్రైవర్, ప్రయాణీకుల మోకాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంచి సేఫ్టీ ఫీచర్లను అందించారు. మొత్తంమీద, ఈ కారు అన్ని విధాలుగా అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఈ ఎస్యూవీ పొందిన స్కోర్ విషయానికి వస్తే..
* ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డీఫార్మబుల్ బారియర్: 16కి 14.41 పాయింట్లు
* విప్లాష్ రియర్ ఇంపాక్ట్: 3కి 2.36 పాయింట్లు
* సైడ్ పోల్ ఇంపాక్ట్: 8కి 7.36 పాయింట్లు
* సైడ్ మూవబుల్ డీఫార్మబుల్ బారియర్: 8కి 7 పాయింట్లు
ప్రస్తుతం నిస్సాన్ కిక్స్ గ్లోబల్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. నిస్సాన్ ఇండియా ఈ ఎస్ యూవీని భారతీయ మార్కెట్‌లో విడుదల చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. అయితే, ఈ కారు సేఫ్టీ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ వినియోగదారులు దీనిని ఆదరించే అవకాశం ఉంది. నిస్సాన్ ఇటీవల మాగ్నైట్ SUV ధరను పెంచింది. జనవరి 31న రూ.22,000 పెరిగిన ధర, ఇప్పుడు మరో రూ.4,000 పెరిగింది. ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ధర రూ.6.14 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Also Read : తక్కువ ధరలో కొత్త లుక్ లో రెనాల్ట్ కైగర్.. మార్కెట్ కొల్లగొట్టడం ఖాయం