Maruti Suzuki New Models
Maruti Suzuki : భారతదేశంలో కార్ల అమ్మకాల్లో అగ్రగామిగా ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి. తక్కువ ధరకే లభించే కార్లతో భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందింది. రాబోయే సంవత్సరాల్లో మారుతికి చెందిన చవకైన కారు కొనాలని మీరు కూడా ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ వార్తను చివరి వరకు చదవండి. ఎందుకంటే మారుతి సుజుకి రాబోయే సంవత్సరాల్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో కంపెనీకి చెందిన ప్రసిద్ధ కార్ల అప్‌డేట్ వెర్షన్‌లు కూడా ఉన్నాయి. మారుతికి చెందిన మూడు చౌక కార్ల వివరాలను ఈ కథనలో తెలుసుకుందాం.
Also Read : త్వరలో మారుతి-హ్యుందాయ్ నుంచి రాబోయే 5హైబ్రిడ్ మోడల్స్ ఇవే
మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ బాలెనో అప్‌డేట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో అప్‌డేట్ చేసిన మారుతి సుజుకి బాలెనోను 2026 సంవత్సరంలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ కొత్త బాలెనోలో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా లీటరుకు 30 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించే అవకాశం ఉంది.
మారుతి 7-సీటర్ ఎంపీవీ
మారుతి సుజుకి మరో చవకైన 7-సీటర్ ఎంపీవీ పై కూడా పని చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. మారుతి రాబోయే ఎంపీవీలో హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చవచ్చు. మారుతి రాబోయే 7-సీటర్ ఎంపీవీ రెనాల్ట్ ట్రైబర్, టయోటా ఇన్నోవా వంటి ఎంపీవీలకు పోటీగా నిలవనుంది.
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్
మారుతి సుజుకి తన అత్యంత వేగంగా అమ్ముడవుతున్న SUV ఫ్రాంక్స్ అప్‌డేట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో రోడ్లపై చాలాసార్లు కనిపించిందని సమాచారం. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ అప్‌డేట్ చేసిన మారుతి ఫ్రాంక్స్‌లో హైబ్రిడ్ ఇంజన్‌ను పవర్‌ట్రెయిన్‌గా ఉపయోగించవచ్చు. ఇది వినియోగదారులకు మంచి మైలేజీని అందించనుంది.
Also Read: ఫస్ట్ టైం ట్యాక్సీ కోసం కేవలం రూ.6.79లక్షలకే మారుతి నయా మోడల్