Renault Kiger Facelift: ఇండియాలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త మోడల్స్ వేగంగా లాంచ్ అవుతున్నాయి. అన్ని కార్ల కంపెనీలు ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పుడు రెనాల్ట్ కైగర్ కొత్త అవతార్‌లో రూ.6 లక్షల నుంచి ఈ విభాగంలో పోటీ పడబోతోంది. ఇటీవల ఇది టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ వాహనంపై కంపెనీ వేగంగా పని చేస్తోంది. కొత్త కైగర్ మార్కెట్లో టాటా పంచ్‌తో పోటీపడనుంది. కొత్త కైగర్‌లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read : టెస్టింగ్ సమయంలో కెమెరా కంట పడ్డ మారుతి నయా మోడల్స్ ఇవే
కొత్త రెనాల్ట్ కైగర్ ఫీచర్లు
ఈసారి కొత్త రెనాల్ట్ కైగర్‌లో చాలా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. ఎక్స్‌టీరియర్ డిజైన్ నుంచి ఇంటీరియర్ వరకు కొత్తదనం కనిపిస్తుంది.ఇందులో 1.0L న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన రెండు ఇంజన్లు ఉన్నాయి. ఇది కాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకొచ్చారు. కొత్త కైగర్‌లో భద్రత కోసం అనేక మంచి ఫీచర్‌లను చూడచ్చు. EBD, 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్, EPS, స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ హిల్ హోల్డ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లను ఈ కారులో చూడచ్చు. కొత్త కిగర్ అంచనా ధర రూ.6 లక్షల నుండి మొదలవుతుంది.
టాటా పంచ్‌తో పోటీ
రెనాల్ట్ కొత్త కైగర్ నేరుగా టాటా పంచ్‌తో పోటీపడుతుంది. పంచ్ ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన మొదటి ఎస్‌యూవీ. ఈ కారులో 5 మంది కూర్చునే అవకాశం ఉంది. చిన్న కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. ఈ కారులో ముందు 2 ఎయిర్‌బ్యాగ్స్, 15 అంగుళాల టైర్లు, ఇంజిన్ స్టార్ట్ స్టాప్, 90 డిగ్రీల ఓపెనింగ్ డోర్లు, సెంట్రల్ లాకింగ్ కీ, వెనుక పార్కింగ్ సెన్సార్, ABS+EBD, ఫ్రంట్ పవర్ విండో, టిల్ట్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భారతదేశ కార్ల మార్కెట్:
భారతదేశంలో కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో పోటీ తీవ్రంగా ఉంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EVs) మార్కెట్ కూడా పెరుగుతోంది. భారతీయ వినియోగదారులు ముఖ్యంగా, ధర, మైలేజ్, భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. అలాగే ఇండియాలో లగ్జరీ కార్ల మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా లంబోర్ఘినీ, మెర్సిడెస్-మేబ్యాక్ వంటి బ్రాండ్లు రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.ఇండియాలోని కార్ల మార్కెట్ చాలా వైవిధ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది.
Also Read : ఫస్ట్ టైం ట్యాక్సీ కోసం కేవలం రూ.6.79లక్షలకే మారుతి నయా మోడల్