దేశంలో ఎక్కువ సంఖ్యలో మొబైల్ వినియోగదారులు జియోను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జియో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందంటూ నివేదికలు వెలువడుతున్నాయి. రాబోయే రోజుల్లో జియో భారీగా టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ధరలు పెరిగితే జియో కస్టమర్లు నష్టపోయే అవకాశం ఉంది. జియో ధరల పెంపు గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఎయిర్ టెల్, జియో మధ్య గట్టి పోటీ నెలకొనగా ఈ మధ్య కాలంలో ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంటే జియో కస్టమర్ల సంఖ్య మాత్రం అంతకంతకూ తగ్గుతోంది. రిలయన్స్ జియో ఏఆర్‌పీయూ క్రమంగా తగ్గుతూ ఉండటంతో జియో టారిఫ్ ధరలను పెంచాలని భావిస్తోంది. ట్రాయ్ లెక్కల ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో 46 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు కొత్తగా జతయ్యారు.
అయితే జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ కొత్త యూజర్ల సంఖ్య 1.22 కోట్లు పెరిగింది. మరోవైపు జియోకు రోజురోజుకు టవర్ల ఏర్పాటు, స్పెక్ట్రమ్ కొనుగోలు వల్ల ఖర్చులు సైతం భారీగా పెరుగుతున్నాయి. జియో సిమ్ వాడివాళ్లలో యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 79 శాతంగా ఉండగా ఎయిర్ టెల్ సిమ్ వాడేవాళ్లలో యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 97 శాతంగా ఉంది. జియో టారిఫ్ ధరలను పెంచుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
దేశీ అతిపెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌గా కొనసాగుతున్న జియో టారిఫ్ ధరల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.