హోం ఐసోలేషన్ లో ఉన్నారా.. పాటించాల్సిన మార్గదర్శకాలివే..?

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండగా కరోనా బాధితులలో ఎక్కువ మంది హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉండి హోం క్వారంటైన్ లో చికిత్స చేయించుకుంటున్న వారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లు స్టిరాయిడ్స్ […]

Written By: Navya, Updated On : April 29, 2021 8:22 pm
Follow us on

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండగా కరోనా బాధితులలో ఎక్కువ మంది హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉండి హోం క్వారంటైన్ లో చికిత్స చేయించుకుంటున్న వారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.

హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లు స్టిరాయిడ్స్ ను నోటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. జ్వరం, దగ్గు కరోనా నిర్ధారణ అయిన ఏడు రోజుల తర్వాత కూడా ఉంటే వైద్యుల సలహాలు, సూచనల ప్రకారమే మందులను వినియోగించాల్సి ఉంటుంది. లక్షణాలు లేనివాళ్లు, తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లు రెమ్ డెసివర్ ఇంజెక్షన్ ను అస్సలు వాడకూడదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ వయస్సు పైబడిన వాళ్లు వైద్యుల పరీక్షల తర్వాతే హోం ఐసోలేషన్ లో ఉండాలి.

హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లు రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడంతో పాటు వేడినీటితో పుక్కలించాలి. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా వైద్యుల సూచనల ప్రకారం చికిత్స తీసుకోవాలి. పారాసిటమాల్ 650 ట్యాబ్లెట్ ను రోజుకు నాలుగుసార్లు వేసుకున్నా జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. ఖాళీ కడుపుతో వేసుకునే ఐవర్ మెక్ టిన్ మాత్రలను 3 నుంచి 5 రోజులు వాడవచ్చు.

జ్వరన్, దగ్గు ఐదురోజుల కంటే ఎక్కువగా ఉంటే రోజుకు రెండుసార్లు ఇన్ హెలేషనల్ బ్యూడెసనైడ్ ను తీసుకోవాలి. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ ఇతరులు వాడిన వస్తులకు వీలైనంత దూరంగా ఉండాలి.