https://oktelugu.com/

ఎగ్జిట్ పోల్స్: బెంగాల్ మమతదే.. బీజేపీ టఫ్ ఫైట్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా కనిపించడం విశేషం. బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది అంచనావేశాయి. బెంగాల్ ఎన్నికల్లో మమత టీఎంసీకి, కేంద్రంలోని బీజేపీకి భీకరయుద్ధమే నడిచింది. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ లో రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2021 / 07:51 PM IST
    Follow us on

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా కనిపించడం విశేషం. బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది అంచనావేశాయి.

    బెంగాల్ ఎన్నికల్లో మమత టీఎంసీకి, కేంద్రంలోని బీజేపీకి భీకరయుద్ధమే నడిచింది. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ లో రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ లో బెంగాల్ లో బీజేపీ అధికారాన్ని చేపడుతుందని సర్వే తేల్చింది. మేజిక్ ఫిగర్ ను అందుకుంటుందని తెలిపింది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 138-148 సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ అంచనావేసింది. టీఎంసీకి 128-138 స్తానాలు రావొచ్చని అంచనావేసింది. వామపక్ష పార్టీలకు 11-21 స్థానాలు వస్తాయని తెలిపింది. అయితే బీజేపీకి మద్దతిస్తున్న రిపబ్లిక్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మేలా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

    ఇక టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే మాత్రం బెంగాల్ లో టీఎంసీదే విజయం అని చెప్పింది. బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుందని తెలిపింది. మమత పార్టీకి 152-164 సీట్లు, ఇక బీజేపీకి 109-121 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక లెఫ్ట్ కాంగ్రెస్ లకు 14-25 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.