Homeబిజినెస్Motorola Edge 70 Fusion: Motorola సంచలనం.. ఇప్పటివరకు ఏ ఫోన్ లో లేని విధంగా...

Motorola Edge 70 Fusion: Motorola సంచలనం.. ఇప్పటివరకు ఏ ఫోన్ లో లేని విధంగా బ్యాటరీ.. తెలిస్తే వెంటనే కొంటారు..

Motorola Edge 70 Fusion: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ నుంచి పలు రకాల సిరీస్ లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే నేటితరం వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు అప్డేట్ చేసిన టెక్నాలజీ తోపాటు బ్యాటరీ వ్యవస్థ మెరుగుపరిచి.. కెమెరా పనితీరును నాణ్యతగా మార్చి అందుబాటులోకి ఎడ్జ్ 70 Fusion మొబైల్ ను తీసుకువచ్చింది. ఇప్పటివరకు మోటోరోలా ఎడ్జ్ 60 Fusion అలరించేది. అయితే దీనికి వారసుడిగా ఈ కొత్త మొబైల్ అప్డేట్ తో రావడమే కాకుండా ధర కూడా అందుబాటులోకి ఉండేలా తక్కువ చేసింది. అంతేకాకుండా ఇందులో మొట్టమొదటిసారిగా కెమెరాను హైలెట్ చేసింది. ఇంతకీ ఈ మొబైల్లో ఉన్న కొత్త విశేషాలు ఏంటంటే..?

Also Read: ఆ వైసిపి మాజీ ఎంపీ కి ఘోర అవమానం

మోటోరోలా ఎడ్జ్ 70 Fusion కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వచ్చిన మోటరోలా మొబైల్స్ లోని కెమెరా కంటే ఇందులో అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ను అమర్చారు. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కలిగి ఉంటుంది. అంటే తక్కువ కాంతి.. వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా కావలసిన ఫోటోలను అందిస్తుంది. అంతేకాకుండా కదులుతున్న వస్తువులను కూడా ఇది స్పష్టంగా చిత్రీకరించే అవకాశం ఉంది. అలాగే ఇందులో AI ఆధారంగా ఖచ్చితమైన రంగులతోపాటు దృశ్యాన్ని ప్రత్యేకంగా ఉంచేలా తీర్చిదిద్దుతుంది. ఈ కెమెరాతోపాటు 13 MP అల్ట్రా వైట్ సీన్స్ కెమెరా resolution తగ్గకుండా ఫోటోలను అందిస్తుంది. వీటితోపాటు 32 MP ఫ్రంట్ కెమెరా తోపాటు వీడియో కాలింగ్ కూడా సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ కెమెరా అద్భుతమైన పనితీరుతో ఉండనుంది.

ప్రస్తుతం మొబైల్ కొనేవారు చాలామంది బిగ్ డిస్ప్లేను కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి మోటరోలా ఎడ్జ్ 70 Fusion మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6.78 అంగుళాల బిగ్ డిస్ప్లేను చూడొచ్చు. అంతేకాకుండా ఇది 1.5 కే resolution తో ఉండడంవల్ల మూవీస్, గేమింగ్ కోరుకునే వారికి సూపర్ అని అంటూ ఉంటారు. అలాగే ఇది వాతావరణం లో కాంతి సరిగా లేకున్నా కూడా 5200 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. ఇవే కాకుండా ఈ మొబైల్ లో డాల్ఫి అట్మోస్ ఆడియో, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటివి సంగీతం వినేవారికి చాలా అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 7S Gen 4 చిప్ సెట్ ఉండడంవల్ల మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి కూడా సపోర్ట్ గా ఉండనుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ వ్యవస్థ మెరుగు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో 7000 mAh వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది 68 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పని చేస్తుంది. 8 జిబి రామ్ 256 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ను రూ.26,999 ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version