Homeబిజినెస్Shankh Mitra: మస్క్ తర్వాత మనోడే.. ఎవరితను.. ఎంత సంపాదించాడు..

Shankh Mitra: మస్క్ తర్వాత మనోడే.. ఎవరితను.. ఎంత సంపాదించాడు..

Shankh Mitra: ఈ ప్రపంచంలో అపర కుబేరుడు గా పేరు తెచ్చుకున్నాడు ఎలాన్ మస్క్. టెస్లా నుంచి ఎక్స్ వరకు అనేక కంపెనీలను నిర్వహిస్తూ.. భూమి నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు విభిన్నమైన వ్యాపారాలు చేస్తూ.. లక్షల కోట్లను సంపాదించాడు మస్క్. ఇప్పటికీ అతడు సాధారణ జీవితమే గడుపుతుంటాడు. ఆడంబరాల జోలికి వెళ్లడు. అట్టహాసమైన జీవితాన్ని ఆస్వాదించడు.

మస్క్ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్.. ఇంకా కొంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ.. అతడి స్థాయిలో మాత్రం సంపాదించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మస్క్ తర్వాత స్థానంలో ఒక భారతీయుడు కొనసాగుతున్నాడు. ప్రతి ఏడాది వేల కోట్లు సంపాదిస్తూ కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరు.. అతడి నేపథ్యం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికాలో పేరుపొందిన హెల్త్ కేర్ రియల్ ఎస్టేట్ సంస్థగా వెల్టవర్ కు పేరుంది. ఈ కంపెనీకి సీఈవోగా భారత సంతతికి చెందిన శంక్ మిత్ర కొనసాగుతున్నారు. ఈయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆ కంపెనీ లాభాలను మరింత పెంచారు. విస్తరణకు కూడా తోడ్పడ్డారు. ఫలితంగా అతడు ప్రతి ఏడాది వేల కోట్ల వేతనాన్ని అందుకుంటున్నాడు. మిత్ర సంపాదిస్తున్న సంపాదన పై ది వాల్ స్ట్రీట్ జనరల్ ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది.

మిత్రకు 2025లో దాదాపు 821 మిలియన్ డాలర్ల ప్యాకేజీ లభించింది. ఇది మన దేశ రూపాయల విలువలో 7, 744 కోట్లు. ఈ జాబితాలో మస్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ప్యాకేజీ 158 బిలియన్ డాలర్లు.. మిత్రుకు లభించే ప్యాకేజీలో ఎక్కువ భాగం షేర్ల రూపంలోనే ఉంటుంది. అక్టోబర్లో ఇతడికి 789 మిలియన్ డాలర్ల షేర్లు లభించాయి. కంపెనీ స్టాక్ పనితీరు వల్ల.. షేర్ విలువ బిలియన్ డాలర్లకు చేరుకుంది. అందువల్లే మిత్ర సంపాదన పెరిగింది. మిత్ర కోల్ కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు..

మిత్ర మొదటి నుంచి కూడా హెల్త్ కేర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన పనితీరు వల్ల అమెరికాలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందువల్లే వెల్టవర్ కంపెనీ ఈయనను సీఈఓ గా నియమించుకుంది. ఆయన పనితీరు అద్భుతంగా ఉండడంతో.. వేతనాన్ని పెంచింది. కొంతమేర షేర్ల రూపంలో కూడా ఇచ్చింది. ఆ షేర్ల విలువ పెరగడంతో మిత్ర వేతనం పెరిగింది. మస్క్ తర్వాత రెండవ అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోగా మిత్ర రికార్డు సృష్టించాడు అంటే మామూలు విషయం కాదు. కాకలు తీరిన విదేశీయుల వల్ల కానిది మిత్ర చేసి చూపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version