Motorola AC Under 30000 In India: వేసవికాలం రాగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎండవేడికి తట్టుకోలేక చల్లటి వాతావరణం లోకి వెళ్ళాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో సాధారణ ప్లాన్లు, కూలర్లతో చల్లదనం ఉండదని భావించేవారు AIR Conditioner కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వినియోగదారుల అవసరాలను గుర్తించిన చాలా కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకువచ్చాయి. మార్చి నుంచి జూన్ వరకు ఎండలు మండిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏసీల కొనుగోలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే బెస్ట్ ఏసి ఏది? అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. ఇలాంటి వారికి మోటోరోలా కంపెనీ కొత్త ఏసీ ని తీసుకువచ్చింది. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: ఆ వైసిపి మాజీ ఎంపీ కి ఘోర అవమానం!
ప్రముఖ కంపెనీ Motorola గురించి మొబైల్ యూస్ చేసేవారికి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను అందించిన ఈ కంపెనీ ఇప్పుడు కొత్తగా ఏసీలను మార్కెట్లోకి తీసుకువస్తుంది. కొత్తగా ఏసి కొనాలని అనుకునేవారు చాలామంది ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. మాన్యువల్ కంటే ఈ కామర్స్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మోటరోలా కంపెనీ ఫ్లిప్కార్ట్ ద్వారా తన ప్రోడక్ట్ ను విక్రయిస్తుంది. ఈ కంపెనీకి చెందిన ఏసీలు రూ.28,990 నుంచి ఉన్నాయి. అయితే కాన్ఫిగరేషన్ మారితే ధర మారుతుంది. వీటి కొనుగోలుపై దాదాపు రూ.10,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నట్లు పేర్కొంది.
Motorola కంపెనీ నుంచి ఆన్లైన్ మార్కెట్లో నాలుగు రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వన్ టన్ ఏసీ త్రీ స్టార్ ధర రూ.28,900 ఉంది. వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ ధర రూ.31,900.. 1.5 టన్ ఫైవ్ స్టార్ ఏసీ ధర రూ.36,990.. టూ టన్ 3 స్టార్ ఏసీ ధర రూ.38,990 తో విక్రయిస్తున్నారు. అయితే వీటిని బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా ఎక్స్చేంజి ద్వారా కొనుగోలు చేస్తే ఆఫర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా వీటిని కొనుగోలు చేయడం ద్వారా తగ్గింపు ధరతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ కంపెనీకి చెందిన ఏసీల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఏసీ ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. టెంపరేచర్ను బట్టి సెట్టింగ్స్ ఆటోమేటిగ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. విద్యుత్ని కూడా అవసరమైనంత మేరకే తీసుకుంటుంది. ఇందులో స్లీప్ మోడ్, ఎకో మోడ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే టర్బో కూల్ మోడ్. ఆన్ అయిన 20 నిమిషాల్లోనే గది కూల్ అవుతుంది.