Prabhas: నేడు మన టాలీవుడ్ కి పాన్ ఇండియా లెవెల్ మార్కెట్ వచ్చిందంటే అందుకు ముఖ్య కారణం ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనే కనుక బాహుబలి చిత్రాన్ని ఒప్పుకోకపోయుంటే , ఈరోజు మన టాలీవుడ్ కి బాలీవుడ్ లో డామినేషన్ చూపించేంత సత్తా ఉండేది కాదు. కేవలం ఒక్క టాలీవుడ్ కి మాత్రమే కాదు , సౌత్ ఇండియా మొత్తానికి పాన్ ఇండియన్ మార్కెట్ ఇచ్చింది ప్రభాస్ నే, అందులో ఎలాంటి సందేహం లేదు. అదేంటి ‘బాహుబలి’ ని తీసిన రాజమౌళి కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి కదా అని మీరు అనుకోవచ్చు. రాజమౌళి కి ప్రభాస్ లాంటి హీరో దొరికాడు కాబట్టే కదా బాహుబలి వచ్చింది, ఒకవేళ ప్రభాస్ లేకపోతే ‘బాహుబలి’ సాధ్యం అయ్యేదా ?, ఒక్కసారి అలోచించి చూడండి. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో బాహుబలి మేకింగ్ గురించి ‘బాహుబలి – ది టార్చ్ బేరర్’ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ వచ్చింది.
నాలుగు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ లో బాహుబలి మేకింగ్ వీడియోస్ ని పొందుపరుస్తూ , ఈ సినిమాకు సంబంధించిన తమ అనుభవాలను చెప్పుకొచ్చారు మూవీ టీం. ముఖ్యంగా ప్రభాస్, రానా, అనుష్క కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ లోని విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా ఒప్పుకునే ముందు ‘పోతే నా సినీ కెరీర్ పోతాది.. లేదంటే మన టాలీవుడ్ రూపు రేకలు మారిపోతాయి’ అనుకోని రంగం లోకి దిగాను అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. అంటే ఈ సినిమా కోసం ఆయన తన మూడేళ్ళ విలువైన సమయాన్ని, కెరీర్ ని పణంగా పెట్టి చేశాడు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. మేకింగ్ వీడియోస్ లో పాపం ఆయన కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు.
నాన్ స్టాప్ గా పని చేసి అలిసిపోయి రోడ్ల మీద పడుకున్న సందర్భాలను కూడా ఈ డాక్యుమెంటరీ లో చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఈ చిత్రం కోసం గొడ్డులాగా కష్టపడ్డారు. కేవలం ఆయన ఒక్కరే కాదు , రానా, అనుష్క వంటి వారు కూడా అదే రేంజ్ లో కష్టపడ్డారు. ఊరికే 2000 కోట్ల గ్రాస్ రాదు కదా, వాళ్ళ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం పదింతలు ఎక్కువ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా తిరుగులేని స్టేటస్ తో కొనసాగుతున్నారు. రానా కి ఆరోగ్య సమస్యలు రీత్యా సినిమాలు అనుకున్న స్థాయిలో చేయడం లేదు కానీ , ఒకవేళ ఆయన కూడా ఈ సిరీస్ తర్వాత కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఉండుంటే వేరేలా ఉండేదేమో. ఇకపోతే ప్రభాస్ కష్టానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ని క్రింది వీడియో లో అందిస్తున్నాము చూడండి.
