డబ్బు రెట్టింపు చేసే స్కీమ్స్.. రూ.2 లక్షలు పెడితే రూ.4 లక్షలు!

మనలో చాలామంది డబ్బును రెట్టింపు చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కొన్ని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బును సులభంగా రెట్టింపు చేసుకోవచ్చు. కచ్చితమైన లాభాన్ని పొందడంతో పాటు ఎంచుకునే స్కీమ్ ఆధారంగా డబ్బు రెట్టింపు కావడం జరుగుతుందని చెప్పవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరితే డబ్బు 9 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ఈ స్కీమ్ లో చేరితే 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ లో చేరితే 9.73 ఏళ్లలో డబ్బు […]

Written By: Kusuma Aggunna, Updated On : July 6, 2021 6:21 am
Follow us on

మనలో చాలామంది డబ్బును రెట్టింపు చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కొన్ని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బును సులభంగా రెట్టింపు చేసుకోవచ్చు. కచ్చితమైన లాభాన్ని పొందడంతో పాటు ఎంచుకునే స్కీమ్ ఆధారంగా డబ్బు రెట్టింపు కావడం జరుగుతుందని చెప్పవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరితే డబ్బు 9 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ఈ స్కీమ్ లో చేరితే 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ లో చేరితే 9.73 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులని చెప్పవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ స్కీమ్ లో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 6.6 శాతం వడ్డీ లభించడంతో పాటు పదేళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది.

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో చేరితే పది సంవత్సరాలకు డబ్బు రెట్టింపు అవుతుంది. ఇది ఐదేళ్ల స్కీమ్ కావడం గమనార్హం. టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే 5.5 శాతం వడ్డీ లభించడంతో పాటు 13 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తుండగా డబ్బు 12 ఏళ్లలో రెట్టింపు కావడం జరుగుతుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో 4 శాతం వడ్డీ లభిస్తుంది.

ఈ స్కీమ్ ద్వారా డబ్బు 18 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. వయస్సు, అర్హత, ప్రయోజనాల ఆధారంగా స్కీమ్ లను ఎంచుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.