మొన్నటి వరకు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇక ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. దాదాపు నెల రోజుల పాటు కరోనాతో ఇంటికే పరిమితమైన జనసేనాని ఒక ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతి పర్యటనను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటించడానికి కారణమూ ఉందనే చర్చ మొదలైంది. 2024 ఎన్నికల కోసం పవన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన తిరుపతి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పశ్చిమగోగావరి జిల్లా భీమవరం, విశాఖలోని గాజువాక నంచి పోటీ చేశారు. అయితే వైసీపీ ధాటికి తట్టుకోలేక రెండు చోట్లా విఫలమయ్యారు. దీంతో తాను అధికారంలో లేకున్న ప్రజల మనిషినని చెబుతూ ప్రజా పర్యటన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని గతేడాది ఆయన రైతుల వద్దకు వెళ్లి పలకరించారు. అవసరమైన వారికి సాయం చేశారు. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి సినిమాల్లోకి వెళ్లిన పవన్ ఇక పొలిటికల్ పై ఫోకస్ చేయనున్నాడు.
పవన్ తిరుపతి పర్యటనలో ఓ మతలబు ఉందని అంటున్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నాడట. తిరుపతిలో వైసీపీ కొంచెం వీక్ గా ఉంది. టీడీపీ కంచుకోట అయినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇందులో భాగంగా ఇప్పటినుంచే తిరుపతి ప్రజలను ఆకట్టుకునే విధంగా నియోజకవర్గంలో పర్యటించాలని అనుకుంటున్నాడట.
గతంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఈసారీ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పర్యటించేందుకు రెడీ అవుతున్నాడు. 2019 ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనున్నాడు. వాస్తవానికి ఆ సమయయంలో సీపీఎం, బీఎస్పీలకు పెద్దగా బలం లేదు. అప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగినట్లయింది. అయితే ఈసారి మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దను ఆలోచిస్తున్నారట.