MG Comet EV 2025
MG Comet EV 2025 : ఎంజీ మోటార్ ఇండియా 2025 కామెట్ ఈవీని భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు వెనుక పార్కింగ్ కెమెరా, పవర్ ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, లెథరెట్ సీట్స్, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో వస్తుంది. దీనిపై కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1 లక్ష 20 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అందజేస్తుంది. అందువల్ల కస్టమర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా 8ఏళ్లు లేదా 1 లక్ష 20 వేల కి.మీ. హాయిగా నడపవచ్చు.
Also Read : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్లు
ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కారులో కొన్ని ఫీచర్స్ ను కూడా అప్ డేట్ చేసింది. ఇప్పుడు దీనిలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా అందించింది. ఇది క్రీప్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. ఇది డ్రైవర్ బ్రేక్ నుండి తన పాదాన్ని తీసివేసిన వెంటనే కారు కదలడం ప్రారంభిస్తుంది. గతంలో కామెట్ ఈవీని నడపడానికి డ్రైవర్ యాక్సిలరేటర్ నొక్కాల్సి వచ్చేది. ఎంజీ కామెట్ ఈవీ ధర రూ. 7 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.81 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ రెంటల్ పద్ధతిలో రూ. 4.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 7.80 లక్షల వరకు ఉంటాయి.
ఎంజీ కామెట్ ఈవీలో స్పెషల్ E-షీల్డ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో 3 సంవత్సరాల రోడ్-సైడ్ హెల్ప్, 3 ఫ్రీ లేబర్ సర్వీసులు, బ్యాటరీ ప్యాక్‌పై 8 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కి.మీ వారంటీ ఉన్నాయి. 2025 కామెట్ ఈవీ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జ్, ఎక్స్‌క్లూజివ్ , ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జ్. ఈ కారు కావాలనుకునే వాళ్లు రూ.11,000లను చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఎక్సైట్, ఎక్సైట్ FC వేరియంట్లలో వెనుక పార్కింగ్ కెమెరా, పవర్-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లు (ORVMలు) కూడా ఉంటాయి. ఎక్స్‌క్లూజివ్ , ఎక్స్‌క్లూజివ్ FC వేరియంట్లను లెదర్ సీట్స్, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ చేశారు. ఇన్-క్యాబిన్ ఎక్స్ పీరియన్స్ మరింత ప్రీమియంగా మార్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ 17.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు ప్రయాణించగలదు.
ఎంజీ కామెట్ ఈవీ సైజు గురించి మాట్లాడుకుంటే.. పొడవు దాదాపు 2974ఎంఎం (2.97మీ), వెడల్పు 1505ఎంఎం, ఎత్తు 1640ఎంఎం, వీల్‌బేస్ 2010ఎంఎం. ఎంజీ కామెట్ ఈవీ డిజైన్, సైజ్ చాలా ఆకర్షణీయంగా, కాంపాక్ట్ గా ఉంది. ఇది సిటీ డ్రైవింగ్ చేయడానికి సరైనది. ఇది మినీ-హ్యాచ్‌బ్యాక్ షేప్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో పెద్ద హెడ్‌లైట్లు, సిగ్నేచర్ గ్రిల్ డిజైన్ ఉన్నాయి.
Also Read : ఈ కార్లపై రూ.1.70 లక్షల తగ్గింపు.. మార్చి 31 లోపే.. వెంటనే తెలుసుకోండి..