Car Offers March 2025: ప్రతీ ఏడాది మార్చి 31 తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ సందర్భంగా కొన్ని ఫైనాన్స్ సంబంధించిన వాటిలో ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఆటోమోబైల్ రంగంలోనూ ఈ పద్ధతిని పాటిస్తున్నారు. తాజాగా ఓ కంపెనీ కొన్ని కార్లపై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఈ కార్లకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ వినియోగదారులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఫ్రెంచ్ కు చెందిన CITROENకంపెనీ భారత్ లో ప్రఖ్యాత పేరు తెచ్చుకుంది. ఈ కంపెనీ గత సంవత్సరంలో విజయవంతంగా సేల్స్ నమోదు చేసుకుంది. అయితే కొత్త ఏడాది సందర్భంగా వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని మోడల్స్ పై రూ.1. 70 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఆ మోడళ్లు ఏవో తెలుసుకుందాం..
Also Read: కార్ల బుకింగ్స్ కు తత్కాల్ స్కీం.. 35ఏళ్ల క్రితమే దేశంలో అమలు.. దాని స్పెషాలిటీ ఏంటంటే ?
కొత్తగా కారు కొనాలని అనుకునే వార లో బడ్జెట్ లో కారు కొనాలని అనుకుంటారు. ఇదే సమయంలో పండుగలు, ప్రత్యేక సందర్భంగాల్లో వెహికల్ తీసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎటువంటి పండుగలు లేకపోయినా సిట్రియొన్ కంపెనీ C3, EC3, Basalt, Aircross అనే కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఈ ఆపర్లు మార్చి 31 లోపేనని గడువు విధించింది.
వీటిలో సిట్రియొన్ C3 కారుపై రూ. లక్ష వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.6.16 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ రూ.10. 15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 108 బీహెచ్ పీ పవర్ తో పాటు 205 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో పెట్రోల్ తో పాటు టర్బో ఇంజిన్ ను కూడా అమర్చారు. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ పై పనిచేస్తుంది.
ఈ కంపెనీకి చెందిన ఈ సీ3 అనే కారుపై ఆఫర్ ప్రకటించింది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.12.76 లక్షల ప్రారంభ ధరతో ఉంది. టాప్ ఎండ్ రూ.13.41 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారుపై రూ. 80,000 వరకు డిస్కౌంట్ ను అందించనున్నారు. పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ ను కలిగిన ఈ కారులో 29.2 కిలో వాట్ బ్యాటరీని చేర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
సిట్రియొన్ బసాల్ట్ అనే కారుపై రూ.1.70 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.8.25 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు టర్బో ఇంజిన్ ను కూడా అమర్చారు. ఇందులో సేప్టీ ఫీచర్స్ కూడా అమర్చారు. 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆప్షన్లు ఉన్నాయి.
Also Read: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా వ్యాలిడిటీ