Sobhita- Naga Chaithanya
Sobhita Dhulipala : ఇండస్ట్రీ లో మిస్టరీ గా మిగిలిపోయిన అనేక అంశాలలో ఒకటి నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) లకు సంబంధించిన ప్రేమ, పెళ్లి వ్యవహారం. ఒకే చోట పని చేసే వాళ్ళు, ఏ రంగం లో అయినా స్నేహితులు అవ్వడం, ప్రేమించుకోవడం వంటివి మనం చూసాము. కానీ ఇప్పటి వరకు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించని వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. అయితే రీసెంట్ గానే ఒక ఆంగ్ల పత్రికకు నాగచైతన్య, శోభిత కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్లిద్దరు ఒకరి గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమె నాగ చైతన్య తో పరిచయం ఎలా ఏర్పడింది,ఎలా ప్రేమించుకున్నారు అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది నమ్మడానికి కాస్త ఎవరికైనా కష్టమే. సోషల్ మీడియా ద్వారా వీళ్లిద్దరి పరిచయం జరిగిందట.
Also Read: మాజీ ప్రియుడి కోటు ధరించిన తమన్నా..మళ్ళీ కలిసిపోయారా?
శోభిత మాట్లాడుతూ ‘ఒక రోజు నేను ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో లైవ్ చాట్ ని నిర్వహించాను. చాలా మంది అభిమానులు మీరెందుకు నాగ చైతన్య ని ఫాలో అవ్వడం లేదని అడిగారు. అతన్ని నేనెందుకు ఫాలో అవ్వాలి?, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు అని నాగ చైతన్య ప్రొఫైల్ ని ఓపెన్ చేసి చూసాను. కాసేపు ఆయన అకౌంట్ ని పరిశీలిస్తూ, ఆయన ఫాలో అవుతున్న వారిని గమనించాను. 70 మందిని ఆయన ఫాలో అవుతుంటే అందులో నేను కూడా ఉన్నాను. అది చూసి షాక్ కి గురైన నేను వెంటనే నాగ చైతన్య ని ఫాలో అయ్యాను. అలా మా ఇద్దరి మధ్య తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మేమిద్దరం ఒక కాఫీ షాప్ లో కలుసుకున్నాము. అక్కడి నుండి స్నేహం, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి వంటివి అలా జరిగిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత.
నాగ చైతన్య సింప్లిసిటీ గురించి మాట్లాడుతూ ‘నాగ చైతన్య ని కలిసి ముందు వరకు ఒక మనిషి ఇంత సింపుల్ గా ఉండగలరా అనే విషయం నాకు తెలియదు. ఇంట్లో చైతన్య తన పనులను తానే చేసుకునేవాడు. తనకు ఎంతో ఇష్టమైన బైక్ ని శుభ్రంగా కడిగేందుకు కోసం ఆయన రెండు గంటల సమయం తీసుకుంటాడు. ఆయన సింప్లిసిటీ కే నేను ఫిదా అయిపోయాను. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే మనిషి ఆయన. తనకు ఇష్టమైన వస్తువుల కోసం, ఇష్టమైన మనుషుల కోసం ఏది చేయడానికైనా వెనుకాడడు. ఎన్ని సమస్యలు ఎదురైనా పాజిటివ్ గా అలోచించి అడుగులు ముందుకు వేస్తాడు. ఇలాంటి మనుషులు దొరకడం చాలా అరుదు, నేను అదృష్టవంతురాలిని’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత. ఇక వీళ్లిద్దరి పెళ్లి తర్వాత విడుదలైన ‘తండేల్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం.