https://oktelugu.com/

Maruthi Cars: 9 మారుతి కార్లపై తగ్గింపు ధరలు..త్వరపడండి..

మారుతి కంపెనీకి చెందిన ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిస్టమ్ మోడళ్లపై తాజాగా తగ్గింపు ధరలను ప్రకటించింది. వీటిలో ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, డిజైర్, బాలెనో, ఫోరెక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. వీటిపై జూన్ 1 నుంచి ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 6, 2024 / 09:11 AM IST

    Maruthi suzuki cars

    Follow us on

    Maruthi Cars: మారుతి కార్లంటే ఎవరికైనా క్రేజే. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేవిధంగా వివిధ వేరియంట్లను పరిచయం చేసిన ఈ కంపెనీ అమ్మకాల్లో ముందుంటుంది. అయితే అమ్మకాలు ఏ రేంజ్ లో ఉన్నా వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని సమయాల్లో ధరల తగ్గింపును ప్రకటిస్తుంది.

    తాజాగా ఈ కంపెనీకి చెందిన 9 మోడళ్లపై ధరలు తగ్గించింది. కొత్తగా కారు కొనాలనుకునేవారు ఈ సమయంలో తీసుకోవడం వల్ల లో బడ్జెట్ తోనే అనుకున్న కారును కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇంతకీ మారుతి తగ్గించిన కార్లు ఏవో చూద్దాం..

    మారుతి కంపెనీకి చెందిన ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిస్టమ్ మోడళ్లపై తాజాగా తగ్గింపు ధరలను ప్రకటించింది. వీటిలో ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, డిజైర్, బాలెనో, ఫోరెక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. వీటిపై జూన్ 1 నుంచి ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లకు వర్తిస్తున్నట్లు తెలిపింది. 2014 నుంచి మారుతి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లను అందిస్తుంది. ఈ మోడల్ కు చెందిన వాటిపై తగ్గింపు ఉండే ఛాన్స్ ఉంది.

    ధరల తగ్గింపు AGS వేరియంట్ వినియోగదారులకూ వర్తిస్తుంది. ధరల తగ్గింపు ద్వారా మార్కెట్లో మారుతి సేల్స్ పెరుగుతాయని భావిస్తోంది. గతంలో స్విప్ట్ పై రూ.2500 పెంచిన మారుతి ఇప్పుడు రూ.5000 తగ్గించడంతో వినియోగదారులను ఆకర్షించినట్లయింది. దీంతో కొత్తగా మారుతి కారు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఆఫర్లతో ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు.