https://oktelugu.com/

Pawan Kalyan: చిరంజీవి కి జరిగిన అవమానానికి పవన్ కళ్యాణ్ రివెంజ్ తీర్చుకున్నారా..?

జనసేన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగాడు. ఇక రీసెంట్ గా వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో భారీ విక్టరీని సాధించాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 6, 2024 9:15 am
    Pawan Kalyan

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అమితమైన గౌరవం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కడే ఎదిగి తనకంటూ ప్రస్తుతం ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న చిరంజీవి గురించి చాలా మంది గొప్పగా చెబుతూ ఉంటారు. ఆయన ప్రతిభ అతన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టింది అంటూ తన అభిమానులైతే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు.

    ఇక జనసేన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగాడు. ఇక రీసెంట్ గా వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో భారీ విక్టరీని సాధించాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే గత ప్రభుత్వం సినిమాల విషయంలో వివక్షను చూపిస్తూ సినిమా టికెట్లకి రేట్లు తగ్గించినపుడు చిరంజీవి ముందుకు వచ్చి ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున, రాజమౌళి లాంటి సినిమా హీరో దర్శకులను తన వెంట వేసుకొని అప్పటి ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సినిమాల గురించి టికెట్ల రేట్లు పెంచమని అడగడానికి వెళ్ళాడు. కానీ అక్కడ చిరంజీవికి చాలా దారుణమైన అవమానం అయితే జరిగింది. హఫ్ కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ కార్లను ఆపేసి వాళ్ళను నడిపించుకుంటూ సీఎం ఆఫీస్ లోకి తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి.

    ఇక దానికి తోడుగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డితో చేతులు జోడించి దండం పెడుతుంటే జగన్ వెకిలి నవ్వు నవ్వడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక దానికి ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశ్యం తోనే పవన్ కళ్యాణ్ చాలా గట్టి పోటీని ఇస్తూ వైసిపి పార్టీ రూపు రేఖల్లేకుండా గల్లంతయ్యే విధంగా ప్రణాళికలను రచించి సక్సెస్ అయ్యాడు.

    ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గత ఎలక్షన్లలో ఒక్క సీటు మాత్రమే గెలిస్తే, ఇప్పుడు పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాల్లో 21 గెలిచాడు. అలాగే 2 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే ఆ రెండు సీట్లను కూడా గెలిపించుకున్నాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో ఈ ఎలక్షన్లలో ఘన విజయం సాధించి తను గేమ్ చేంజర్ గా మారిపోయాడనే చెప్పాలి…