Ram Charan: బుచ్చిబాబు సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న రామ్ చరణ్…

రామ్ చరణ్ మాత్రం డూప్ ను వాడడానికి అసలు ఇష్ట పడక తనే జిమ్నా స్టిక్స్, కర్ర సాము లాంటి వాటన్నింటిని నేర్చుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ తన సినిమాలో ఏది చేసినా తనే చేయాలి అనుకుంటాడు.

Written By: Gopi, Updated On : June 6, 2024 8:48 am

Ram Charan

Follow us on

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఏర్పాటు చేసుకొని తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఎప్పుడైతే రంగస్థలం సినిమా వచ్చిందో అప్పటి నుంచి రామ్ చరణ్ నటన పరంగా చాలా పరిణితి చెందడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక దాంతో పాటుగా బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమాలో జిమ్నాస్టిక్స్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉంటుందట… ఇక దానికోసం బుచ్చిబాబు డూప్ ని వాడదాం అని రామ్ చరణ్ కి చెప్పాడట. అయినప్పటికి రామ్ చరణ్ మాత్రం డూప్ ను వాడడానికి అసలు ఇష్ట పడక తనే జిమ్నా స్టిక్స్, కర్ర సాము లాంటి వాటన్నింటిని నేర్చుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ తన సినిమాలో ఏది చేసినా తనే చేయాలి అనుకుంటాడు.

అందుకే డూప్ కి మాత్రం అసలు చేసే చాన్స్ ఇవ్వడు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.. జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉండే సీన్ కోసం దాదాపు నెల రోజుల నుంచి కష్టపడుతున్నాడట…డెడికేషన్ అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆయన మీద ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కూడా తను మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సంవత్సరం శంకర్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు… చూడాలి మరి తను అనుకున్నట్టుగానే సక్సెస్ కొడుతడా లేదా అనేది…