Airtel Jio Tariff Hike: రేపటి నుంచి ధరల మోత.. ఈరోజు రీచార్జ్ చేసుకుంటే ఏమవుతుంది?

అన్ని టెలికం సంస్థల చార్జీల పెంపు జూలై 3 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా రీచార్జ్‌ చేసుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 10:55 am

Airtel Jio Tariff Hike

Follow us on

Airtel Jio Tariff Hike:  దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు ఇటీవల భారీగా రీచార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచాయి. జీయో మొదట చార్జీలు పెంచగా తర్వాత ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ఐడియా సంస్థలు కూడా చార్జీలు పెంచేశాయి. పెంపులో స్వల్ప తేడా ఉన్నా.. అన్ని సంస్థలు 20 నుంచి 40 శాతం వరకు చార్జీలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు వినియోగదారులకు పాత ప్లాన్‌తో రీచార్జి చేసుకోవాలని మెస్సేజ్‌ పంపుతున్నాయి. అన్ని టెలికం సంస్థల చార్జీల పెంపు జూలై 3 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా రీచార్జ్‌ చేసుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి.

రీచార్జ్‌ యాక్టివేషన్‌లో ఉన్నా..
ఇప్పటికే ఒక రీచార్జ్‌ ప్లాన్‌ యాక్టివేషన్‌లో ఉన్నవారు కంపెనీలు పంపుతున్న మెస్సేజ్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఒక ప్లాన్‌ యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు మళ్లీ రీచార్జ్‌ చేసుకుంటే డబ్బులు వృథా అవుతాయేమో అని ఆలోచిస్తున్నారు. ఒక ప్లాన్‌ యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు మరో ప్లాన్‌ రీచార్జ్‌ చేయొచ్చా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

డబ్బులు ఆదా..
ఒక రీచార్జ్‌ ప్లాన్‌.. యాక్టివేషన్‌లో ఉన్నా కూడా మరో ప్లాన్‌ రీచార్జ్‌ చేసుకోవచ్చు. చేసుకోవద్దనే నిబంధన ఏమీ లేదు. డబ్బులు ఉన్నప్పుడు రీచార్జ్‌ చేసుకుంటే.. ప్రస్తుతం యాక్టివేషన్‌లో ఉన్న ప్లాన్‌ గడువు ముగియగానే.. తర్వాత రీచార్జ్‌ ప్లాన్‌ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌ అవుతుంది. ప్రస్తుతం అన్ని టెలికాం సంస్థలు రీచార్జ్‌ ప్లాన్స్‌ ధరలు పెంచిన నేపథ్యంలో లాంగ్‌ టర్మ్‌ ప్లాన్స్‌ రీచార్జ్‌ చేసుకుంటే డబ్బులు ఆదా అవుతాయి. ప్రస్తుతం చేసుకున్ని రీచార్జ్‌ ప్లాన్‌ క్యూలో ఉంటుంది.