Maruti Suzuki Swift: దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ అగ్రగామిగా ఉంటూ వస్తోంది. ఈ కంపెనీ నుంచి ఏ కొత్త కారు వస్తుందన్నా.. వినియోగదారులు ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులు ఇటీవల స్విప్ట్ 4వ జనరేషన్ కారును రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. దశాబ్దాలుగా స్విప్ట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇటీవల ఈ మోడల్ 30 లక్షల సేల్స్ ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. అయితే లేటేస్ట్ స్విప్ట్ పసుపు కలర్లో కనిపించింది. ఈ కారును చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ కారు కోసం వెతుకుతున్నారు. కానీ ఇది దొరకదు.. ఎందుకంటే?
మారుతి సుజుకీ స్విప్ట్ 2024 ను మే 9న రిలీజ్ చేశారు. పాత స్విప్ట్ కు ఉన్న క్రేజ్ తో దీనిని కొత్త హంగులు చేర్చి.. లేటేస్ట్ టెక్నాలజీతో స్విప్ట్ 2024 మార్కెట్లోకి తీసుకొచ్చారు. లేటేస్ట్ స్విఫ్ట్ 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 112 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. వీటితో పాటు ఆకట్టుకునే కొన్ని ఫీచర్స్ ను ఇందులో అమర్చారు.
కొత్త స్విప్ట్ వివిధ రూపాల్లో మార్కెట్లోకి వచ్చింది. అయితే లేటేస్టుగా ఈ కారు పసుపు కలర్లో రోడ్డుపై కనిపించింది. ఈ కారును చూసి కొందరు షాక్ అవుతున్నారు. యెల్లో కలర్ పై ఉన్న ఇష్టంతో కొందరు ఇలాంటి కారు కోసం వెతుకుతున్నారు. కానీ ఇది ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఈ కలర్ కంపెనీలో అందుబాటులో లేదు. వేరే కలర్లో ఉన్న కారును వినియోగదారుడు ప్రత్యేకంగా పసుపు కలర్లో కి మార్చుకున్నాడు.
అయితే కారు కలర్లను ఇలా ఇష్టమొచ్చినట్లు మార్చడం కుదరదు. దీని కోసం కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఎవరైనా తమ కారు రంగు మార్చాలనుుకుంటే ముందుగా ఆర్డీవో వద్ద అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత ఆర్టీఏ కార్యాలయం నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడు మీ కారును ఏ కలర్లోకి అయినా మార్చుకోవచ్చు. కంపెనీ సైతం కార్ల రంగును ఇష్టానుసారం మార్చడానికి వీలు లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.
గతంలో చాలా మంది యజమానులు తమ కార్ల రంగును మార్చుకున్నారు. లేటేస్టుగా ఓ వ్యక్తి తనకు నచ్చిన పసుపు రంగును వేయించుకున్నాడు. దీనిని రాత్రి సమయంలో నడిపినప్పుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా కొత్త స్విప్ట్ ఈ కలర్లో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి కారు కావాలంటే దీని కోసం వెతకకుండా అనుమతి తీసుకొని రంగు మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు.