https://oktelugu.com/

ITR return : ఐటీఆర్ రిటర్న్ కు చివరి తేదీ: దాఖలు చేసింది 6 కోట్ల మందే.. గతేడాది కంటే తక్కువే.. వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యలు తెలుసా?

ఎటువంటి పెనాల్టీ లేకుండా ITR ఫైల్ చేయాలనుకుంటే మీకు ఈ రోజు సమయం ఉంది. ఈ రోజు తర్వాత అయితే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. అంతే కాదు.. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోతే జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులు ఈ రోజు చివరి తేదీలో మీ ఐటీఆర్ ను ఫైల్ చేయలేకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2024 / 02:03 PM IST
    Follow us on

    ITR return  : పన్ను రిటర్న్ ఫైల్ చేసే వారికి ఈ రోజే (జూలై 31) ఆఖరు గడువు. ఆదాయపు పన్ను 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను దాఖలు చేశారు. ఈ సంఖ్య 6 కోట్లకు చేరుకుంది. గడువు (ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ) పొడిగించబడే సూచనలు లేవు కాబట్టి మీరు మీ ఐటీఆర్ ఫైల్ చేయకుంటే ఈ పని చేయాలి. లేదంటే జైలుకు వెళ్లడం ఖాయమని నిబంధనలున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జూలై 31వ తేదీ చివరిదిగా నిర్ణయించబడింది. నేటితో దాని గడువు ముగుస్తుంది. మంగళవారం (జూలై 30) దీనికి సంబంధించి సమాచారాన్ని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వివరించారు. ‘ఫైనాల్సియల్ ఇయర్ 2023-24లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించి సుమారు 6 కోట్ల మంది రిటర్న్‌లు దాఖలు చేశారు. మునుపటి ఆర్థిక సంవత్సరం 2022-23కి 8.61 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి’ అని ఆయన వివరించారు. PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్, పరిశ్రమ పోస్ట్ బడ్జెట్ సెషన్‌లో ప్రసంగిస్తూ రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ఈ సమాచారాన్ని అందించారు. కొత్త పన్ను విధానం వైపు ప్రజలు మొగ్గు చూపుతారా లేదా అనే ఉత్కంఠత నెలకొందన్నారు. కానీ ఇప్పటి వరకు దాఖలు చేసిన ఐటీఆర్ డేటాలో 70 శాతం కొత్త పన్ను విధానంలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో రెండు పన్ను వ్యవస్థలు ఉన్నాయి.. పాత ఆదాయపు పన్ను విధానంలో పన్ను రేట్లు సాపేక్షంగా ఉన్నాయి. అయితే పన్ను చెల్లింపుదారులు అనేక రకాల మినహాయింపులు తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి దీని లాగానే తగ్గింపులు కూడా తక్కువగా ఉంటాయి.

    ఈ రోజు రిటర్న్స్ చేయకుంటే ఏమవుతుంది?
    ఎటువంటి పెనాల్టీ లేకుండా ITR ఫైల్ చేయాలనుకుంటే మీకు ఈ రోజు సమయం ఉంది. ఈ రోజు తర్వాత అయితే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. అంతే కాదు.. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకపోతే జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులు ఈ రోజు చివరి తేదీలో మీ ఐటీఆర్ ను ఫైల్ చేయలేకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఐటీఆర్ ను ఆలస్య జరిమానా, పన్నుపై వడ్డీతో డిసెంబర్ 31, 2024 వరకు దాఖలు చేయవచ్చు. ఈ తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉండదు. దీని తర్వాత ఆదాయపు పన్ను శాఖ కొన్ని షరతులతో కూడిన చర్యలు తీసుకుంటుంది.

    ఐటీఆర్‌ను ఆలస్యంగా ఫైల్ చేస్తే మీరు పన్నుపై వడ్డీ కూడా చెల్లించాలి. పన్ను చెల్లింపుదారులు ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినందుకు రూ. 5000 వరకు జరిమానా ఉంటుంది. అదే సమయంలో, డిసెంబర్ 31, 2024 లోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, ఆదాయపు పన్ను శాఖ ద్వారా పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపచ్చని నిపుణులు చెప్తున్నారు. నోటీసులు పంపిన తర్వాత చెల్లింపుదారుల పన్ను మొత్తంపైన 50 శాతం నుంచి 200 శాతం వరకు ఫైన్ విధించవచ్చు.

    గడువు తేదీ నుంచి రిటర్న్ దాఖలు చేసే వరకు పన్ను మొత్తంపై వడ్డీని వసూలు చేయవచ్చు. కొన్ని పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులపై కూడా దావా వేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఐటీఆర్ దాఖలు చేయకపోతే 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. పన్ను మొత్తం రూ.10,000 దాటిన సందర్భాల్లో మాత్రమే ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేయమని ఆదాయపు పన్ను దేశం నిరంతరం పన్ను చెల్లింపుదారులను కోరుతుంది.