https://oktelugu.com/

Kia Facelift Cars: దిమ్మదిరిగేలా కియా సోనెట్ పేస్ లిఫ్ట్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

కియా సోనెట్ ఎంట్రీ లెవల్ ను రూ.7.99 లక్షలతో విక్రయించారు. ఇందులో కొత్తగా సన్ రూప్ చేర్చి అదనగా రూ.20,000 పెంచారు. . ఈమధ్య ఎక్కువ శాతం కార్లలో సన్ రూప్ కోరుకుంటున్నారు. అందువల్ల ప్రత్యేకంగా ఈ వేరియంట్ ను ఉంచి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 7, 2024 / 11:25 AM IST

    Kia Sonet Facelift

    Follow us on

    Kia Facelift Cars:  దక్షిణ కొరియా కంపెనీ కియా భారత కార్ల మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన సోనెట్ ను ఇప్పటికే ఆదరించారు. అయితే ఇది కొన్ని మార్పులు చేసుకొని రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. ఇటీవల ఫేస్ లిప్ట్ గా మార్కెట్లోకి వచ్చిన సోనెట్ వినియోగదారులకు అనుగుగా ఫీచర్లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా రూ.10 లక్షల లోపు వెచ్చింది దీనిని ఇంటికి తీసుకురావచ్చు. అయితే ఇటీవల వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్న సన్ రూప్ ను కొత్త సోనెట్ లో అమర్చారు. వీటితో పాటు ఉండే అదనపు ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..

    2024 కియా సోనెట్ HTE, HTK అనే రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండింటిలోనూ ఇంజిన్ ఒకే రకంగా ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను అమర్చారు. ఇతర ఫీచర్ల విషయానికొస్తే కొన్నింటిని అప్డేట్ చేశారు. కొత్త కార్లలో GTX +, HTX+ విండోస్ ఉన్నాయి. ఇవి వాయిస్ కమాండ్ ద్వారా యాక్సెస్ అవుతాయి. అరోరా బ్లాక్ ఫెర్ల్, ఇంపీరియల్ బ్లూ, ప్యూర్ ఆలివ్ కలర్లలో ఈ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

    కియా సోనెట్ ఎంట్రీ లెవల్ ను రూ.7.99 లక్షలతో విక్రయించారు. ఇందులో కొత్తగా సన్ రూప్ చేర్చి అదనగా రూ.20,000 పెంచారు. . ఈమధ్య ఎక్కువ శాతం కార్లలో సన్ రూప్ కోరుకుంటున్నారు. అందువల్ల ప్రత్యేకంగా ఈ వేరియంట్ ను ఉంచి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. HTK పాత కారు రూ.8.89 లక్షలు ఉండగా.. కొత్త మోడల్ రూ.9.25 లక్షల ప్రారంభ ధరతోవిక్రయించనున్నారు. వీటితో పాటు ఎల్ ఈడీ కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్ లు, ఆటేమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, వెనుక ఢీఫాగర్ ఉన్నాయి. అయితే సాధారణ సోనెట్ లో ఈ వేరియంట్లు లేవు.

    కియా నుంచి సోనెట్ మాత్రమే కాకుండా సెల్టోస్ ను కూడా అప్డేట్ చేసింది. కస్టమర్లను ఆకర్షించే విధంగా కొత్త వేరియంట్లను అమరుస్తూ ఉత్పత్తి చేస్తున్నారు. సేల్స్ పెంచుకోవడానికి మరిన్ని ఫీచర్లను మర్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అందులోనూ కొత్త ఆఫర్లతో తక్కువ ధరకు అందించాలని మా ప్రయత్నమని వారు తెలుపుతున్నారు.