Kia Clavis: భారతీయ ఆటోమార్కెట్‌లో సోనెట్, సెల్టోస్, కారెన్స్ వంటి సక్సెస్ ఫుల్ మోడళ్లను విక్రయిస్తున్న కియా ఇండియా ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతోంది. కియా ఇండియా తన కొత్త కారు టీజర్‌ను రిలీజ్ చేసింది. దీనికి క్లావిస్ (Kia Clavis) అని పేరు పెట్టారు. ఈ కారు కూడా MPV (మల్టీ-పర్పస్ వెహికల్) సెగ్మెంట్‌లోకి వస్తుంది. అయితే ఇది కారెన్స్ కంటే పూర్తిగా డిఫరెంటుగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కాదు.. క్లావిస్ డిజైన్ అంతా కొత్తగా ఉండబోతోంది. ఈ కారు మారుతి సుజుకి XL6, హ్యుందాయ్ అల్కాజార్, టయోటా ఇన్నోవా హైక్రాస్‌లకు గట్టి పోటీని ఇవ్వడానికి రెడీ అవుతుంది. కంపెనీ దీనిని మే 8న ప్రపంచానికి పరిచయం చేయబోతుంది.
Also Read: 47000కార్లను రీకాల్ చేసిన స్కోడా.. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో ?
కియా విడుదల చేసిన టీజర్‌లో క్లావిస్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లను చూపించారు. ఇందులో ADAS లెవెల్ 2 (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉండనున్నాయి. అంతేకాకుండా, టీజర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా కనిపిస్తున్నాయి. కియా కారెన్స్ ప్రస్తుతం 6 లేదా 7 సీట్ల MPVగా అందుబాటులో ఉంది.
క్లావిస్ సైజు దాదాపు కారెన్స్ లాగానే ఉండవచ్చు. అయితే, ఇందులో పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన బంపర్, లైట్ ఎలిమెంట్స్, రూఫ్ రెయిల్స్, కొత్త డిజైన్‌లోని అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. కారెన్స్‌తో పోలిస్తే క్లావిస్ రోడ్ ప్రెజెన్స్ మరింత స్ట్రాంగుగా ఉండబోతోంది. క్లావిస్‌ను కారెన్స్ కంటే బెస్ట్ గా ఉంచనుంది. ఇందులో మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్లు, కొత్తగా డిజైన్ చేసిన డాష్‌బోర్డ్, అలాగే కొత్త అప్హోల్స్ట్రీ, కలర్ ఆప్షన్‌లు కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర కొత్త ఫీచర్లలో 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా చూడవచ్చు.
A journey that will lead you to the unexpected.
The Clavis – Arriving soon.#Kia #KiaIndia #TheClavis #TheNextFromKia #MovementThatInspires
— Kia India (@KiaInd) May 1, 2025
క్లావిస్‌లో కారెన్స్ మాదిరిగానే ఇంజిన్ ఆప్షన్‌లు ఉండవచ్చని భావిస్తున్నారు. మొదటిది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 113 bhp పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీనితో పాటు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 158 bhp పవర్, 253 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ iMT ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. చివరగా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది, ఇది 115 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రావచ్చు.
Also Read: ఓలా, ఏథర్‌కు ఇక కష్టాలు మొదలు.. బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!