https://oktelugu.com/

Jio Plans : వినియోగదారులకు షాక్ ఇచ్చిన జియో.. భారీగా పెంచేసిన ధరలు

Jio Plans : ప్రస్తుతం భారత్‌లో ఉన్న 5జీ మొబైల్స్‌లో 85 శాతం జియోతో పని చేస్తున్నవే’ అని సంస్థ స్పష్టం చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2024 9:08 pm
    Jio Telecom plans have increased significantly

    Jio Telecom plans have increased significantly

    Follow us on

    Jio Plans : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తమ రీచార్జి టారీఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్‌ పై కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో గురువారం (జూన్ 27) ప్రకటించింది. దీంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లను తెచ్చింది. కొత్త టారీఫ్‌ అమలు నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం ఉంటుంది. ఈ కొత్త ధరలు జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయి.

    రెండు కొత్త సర్వీసులు..
    జియో సేఫ్‌ – క్వాంటం సెక్యూర్‌: ఇది కాలింగ్‌, మెసేజ్, ఫైల్స్ ట్రాన్సఫర్ తో పాటు కమ్యూనికేషన్‌ సదుపాయాలు అందించే యాప్‌. నెలకు రూ.199 చెల్లించి ఈ సర్వీసులను పొందవచ్చు.

    జియో ట్రాన్స్‌లేట్‌- ఏఐ: ఈ యాప్‌ వాయిస్‌ కాల్‌, వాయిస్‌ మెసేజ్‌, టెక్ట్స్‌, ఇమేజ్‌లోని సమాచారాన్ని కృత్రిమ మేథ (ఏఐ)తో అనువాదం చేస్తుంది. నెలకు రూ.99 చెల్లిస్తే ఈ యాప్‌ సేవలు పొందవచ్చు. జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులను ఏడాది పాటు ఉచితంగా జియో అందిస్తుంది.

    85 శాతం జియోతోనే…
    దేశంలో 2జీ నెట్‌వర్క్‌కు పరిమితమైన వారు ఇంకా 250 మిలియన్ల మంది ఉన్నారు. వారు డిజిటల్‌ సేవలను వినియోగించుకోవడం లేదని జియో తెలిపింది. వీరిని కొత్త తరం వైపుగా తీసుకచ్చేందుకు 4జీ సదుపాయంతో జియో భారత్‌, జియో ఫోన్లను తీసుకొచ్చినట్లు తెలిపింది. ‘ట్రూ5జీ ఇప్పుడు అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌. దేశంలో సొంతంగా 5జీ నెట్‌వర్క్‌ అందిస్తున్న టెలికాం సంస్థ మాదే. ప్రస్తుతం భారత్‌లో ఉన్న 5జీ మొబైల్స్‌లో 85 శాతం జియోతో పని చేస్తున్నవే’ అని సంస్థ స్పష్టం చేసింది.