https://oktelugu.com/

Solar System: జియో కొత్త సోలార్ సిస్టమ్.. ధర తక్కువే కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ

జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. అయితే కాస్త ధరలో కూడా రాయితీ పొందవచ్చు. దీనికోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ మొత్తాన్ని పొందుతారు. ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే, ఏకంగా 5 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. అంతేకాదు 25 సంవత్సరాల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 7, 2024 / 05:42 PM IST

    Solar System

    Follow us on

    Solar System: ఈ మధ్య చాలా మంది సోలార్ సిస్టమ్ ను ఎంచుకుంటున్నారు. దీని వల్ల 2 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, విద్యుత్ బిల్లు నెలకు 95% తగ్గుతుంది. దీని వల్ల నాన్‌స్టాప్ కరెంటు లభిస్తుంది. ఇంతకీ ఆ సోలార్ పవర్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ సోలార్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి? దేన్ని ఉపయోగించాలి అనే వివరాలు చూసేద్దాం.

    మీరు గనుక జియో కొత్త సోలార్ సిస్టమ్‌ను కొనుగోలు చేస్తే 2 kw 2000 వాట్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. జియో నుంచి మోనో క్రిస్టల్ లైనర్ లేదా పాలీ క్రిస్టల్ లైనర్ సోలార్ ప్యానెల్‌లను కూడా పొందవచ్చు. ఈ రెండూ గొప్ప ఫీచర్లతో లభిస్తున్నాయి. కానీ ఈ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మీకు 200 చదరపు అడుగుల స్థలం అవసరం. దీని కోసం మీరు ఎనిమిది ప్యానెల్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో 335 వాట్ల 6 ప్యానెల్లు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

    జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. అయితే కాస్త ధరలో కూడా రాయితీ పొందవచ్చు. దీనికోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ మొత్తాన్ని పొందుతారు. ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే, ఏకంగా 5 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. అంతేకాదు 25 సంవత్సరాల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు.

    ఇంటి దగ్గర జియో ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సోలార్ ఇన్వర్టర్‌లు, సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించవచ్చు. మీకు ఇవి తక్కువ ధరలలో లభిస్తాయి. దీని కోసం కూడా మీకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఇక ఈ సబ్సిడీ గురించి గమనిస్తే.. 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్‌ల సోలార్ సిస్టమ్‌లపై రూ.15000 సబ్సిడీ లభిస్తుంది. అలాగే 4 కిలోవాట్ల నుంచి 10 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌లపై కిలోవాట్‌కు రూ.7940 సబ్సిడీ లభిస్తుంది.