https://oktelugu.com/

OTT releases : అజయ్ దేవ్ గన్ మైదాన్ తో పాటు ఈ వారం ఓటీటీలో దుమ్మురేపే యాక్షన్!

Ajay Devgan మలయాళ చిత్రం వర్షన్గల్లకు శేషం. ఈ పీరియాడిక్ కామెడీ డ్రామా బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణ అందుకుంది. రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2024 / 05:43 PM IST

    Ajay Devgan along with Maidan movies releasing this week in OTT

    Follow us on

    OTT releases : వారాంతం వస్తుంది అంటే మూవీ లవర్స్ కి పండగే. ఈ వారం థియేటర్లో దాదాపు 10 సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో శర్వానంద్-కృతి శెట్టి నటించిన మనమే, కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ, నవదీప్ హీరోగా తెరకెక్కిన లవ్ మౌళి వంటి స్ట్రెయిట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే దండుపాళ్యం, వెపన్ వంటి డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. గత వారం విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం, గం గం గణేశా చిత్రాలు సైతం సందడి చేస్తున్నాయి. థియేటర్స్ సినిమాలతో కళకళలాడుతున్నాయి.

    అటు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించేందుకు అద్భుతమైన కంటెంట్ సిద్ధంగా ఉంది. అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా మైదాన్ ఓటీటీలోకి వచ్చేసింది. దర్శకుడు అమిత్ శర్మ తెరకెక్కించిన మైదాన్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అజయ్ దేవ్ గణ్ కి జంటగా ప్రియమణి నటించింది. ఏప్రిల్ 10న విడుదలైన మైదాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

    తమిళ యాక్షన్ డ్రామా స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. యంగ్ హీరో కెవిన్ నటించాడు. అదితి పోహంకార్ హీరోయిన్ గా చేసింది. దర్శకుడు ఎలన్ తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

    సోని లివ్ ఒరిజినల్ గుల్లక్ సీజన్ 4 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. మూడు సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది.

    మలయాళ చిత్రం వర్షన్గల్లకు శేషం. ఈ పీరియాడిక్ కామెడీ డ్రామా బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణ అందుకుంది. రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు చేశారు. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షన్గల్లకు శేషం సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది.