Lok Sabha Election Results 2024: ఈ సారి లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక పేరు వినిపించింది. అయితే ఆ పేరు ఒక చోట గెలుపును, మరో చోట ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇద్దరూ డైనమిక్ పర్సన్సే అయినా.. వారి బిహేవియర్ లో తేడాతో ఒకరు ఓడిపోతే మరొకరు నెగ్గారు. ఇందులో మరో ప్రత్యేకమైన అంశం ఏంటంటే. ఇద్దరూ కూడా ముస్లిం వ్యక్తిపైనే పోటీ చేశారు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం.
మొదట హైదరాబాద్ గురించి తెలుసుకుంటే..
హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న ఎంఐఎం పార్టీ తరుఫున పార్టీ అధ్యక్షుడు అసొదుద్దీన్ ఓవైసీ నిలబడ్డాడు. ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ మాధవీలతను బరింలోకి దింపింది. మాధవీ లత కూడా తీవ్రమైన పోటీ ఇచ్చింది. ఎప్పుడూ హిందువుల దేవుళ్లను కించ పరిచే అపొదుద్దీన్ కూడా గుడికి రావాల్సి వచ్చింది. అంతగా పోటీ ఇచ్చింది మాధవీ లత.
కానీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ఓటర్లను బీజేపీకి అనుకూలంగా మలుచుకునేందుకు మాధవీలత ప్రయత్నించారు. రోడ్ షోలో భాగంగా మసీదు వైపునకు బాణం ఎక్కుపెట్టినట్లు ఫేక్ వీడియో క్రియేట్ చేసి జనంలోకి వదలడంతో ఒక వర్గం నుంచి పూర్తిగా చీత్కారాన్ని ఎదుర్కొన్నరు మాధవీ లత. పోలింగ్ రోజున బుర్కా తొలగించడం లాంటి పనులతో తీవ్ర వివాదాలు మూట గట్టుకున్న ఆమె ఓటమి పాలయ్యారు. ఒవైసీకి 6,61,981 ఓట్లు రాగా, మాధవీ లతకు 3,23,894 ఓట్లు వచ్చాయి.
ఇక కడప నుంచి చూసుకుంటే..
కడప అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ రెడ్డప్పగారి మాధవి రెడ్డిని బరిలోకి దింపింది. రెడ్డిలు, మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కడప అసెంబ్లీకి ఒక పార్టీ ఒక మహిళను బరిలోకి దింపడం ఇదే తొలిసారి. డిప్యూటీ సీఎం అంజాబ్ బాషాపై మాధవీ రెడ్డి 18860 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాధవీ రెడ్డి ఆలోచన, మాటల్లో స్పష్టత, ఆత్మ విశ్వాసంతో ఓట్లను రాబట్టగలిగింది.
ఒక మాధవి పాజిటివ్ ప్రచారంతో కడప కోటను బద్దలు కొట్టగా, మరొకరు మాధవి తన తప్పుల వల్ల ఘోర పరాజయం చవి చూసింది.