రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఆర్సీటీసీ ఇకపై వెబ్ సైట్, యాప్ లో ఆన్లైన్లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణికులు రిఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే రిఫండ్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం రైలు ప్రయాణికులు ఐఆర్సీటీసీ-ఐపే ద్వారా రద్దు చేసిన వెంటనే రీఫండ్ పొందవచ్చు.
2019 సంవత్సరంలో కేంద్రం ఐపేను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా కేంద్రం ఐపేను ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులు రీఫండ్ వెంటనే పొందే విధంగా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేసినట్టు తెలుస్తోంది. పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసిందని ఐఆర్సీటీసీ అధికార ప్రతినిధి తెలిపారు.
యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేయడం వల్ల ఇకపై ప్రయాణికులు తక్కువ సమయంలోనే టికెట్లను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుంది. యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ కావడం వల్ల ప్రయాణికులు తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమయ్యేలా ఏర్పాట్లు జరిగాయి.
ఐఆర్సీటీసీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐఆర్సీటీసీ త్వరలో మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రయాణికులకు అందుబాటులో తీసుకురానుందని తెలుస్తోంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Irctc latest updates good news for online train tickets booking
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com