https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.170 చెల్లిస్తే రూ.3 లక్షలు..?

పోస్టాఫీసులు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. పోస్టాఫీస్‌లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ తో పాటు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అందుబాటులో ఉంటాయి. చాలామందికి పోస్టాఫీస్ లో ఉండే ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన ఉండదు. పోస్టాఫీస్ లోని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో గ్రామ్ సురక్ష స్కీమ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 24, 2021 1:23 pm
    Follow us on

    పోస్టాఫీసులు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. పోస్టాఫీస్‌లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ తో పాటు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అందుబాటులో ఉంటాయి. చాలామందికి పోస్టాఫీస్ లో ఉండే ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన ఉండదు.

    పోస్టాఫీస్ లోని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో గ్రామ్ సురక్ష స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ పాలసీ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ కావడం గమనార్హం. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీలను తీసుకోవడానికి అర్హులు. కనీసం 10,000 రూపాయల మొత్తానికి గరిష్టంగా 10 లక్షల రూపాయల మొత్తానికి ఈ పాలసీలను తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇండియా పోస్టల్ ఈ పాలసీపై 1000 రూపాయలకు 60 రూపాయలు బోనస్ అందించనుంది. ఈ విధంగా లక్షకు ఏకంగా 6,000 రూపాయల బోనస్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 25 సంవత్సరాల వయస్సులో లక్ష రూపాయల బీమా మొత్తానికి పాలసీని తీసుకుంటే నెలకు 199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

    50 ఏళ్ల టర్మ్‌కు ఇది వర్తించగా 55 ఏళ్ల టర్మ్ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.183, 58 ఏళ్లు అయితే రూ.178 60 ఏళ్లకు అయితే రూ.172 చెల్లించాలి. 50 ఏళ్ల ఆప్షన్‌కు రూ.2.5 లక్షలు, 55 ఏళ్లకు రూ.2.8 లక్షలు, 58 ఏళ్లకు రూ.2.98 లక్షలు, 60 ఏళ్లకు రూ.3.10 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.