ఒక్క వ్యాక్సిన్ తో కరోనా వైరస్ కు చెక్.. ఎలా అంటే..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుతోంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా కరోనా కొత్త వేరియంట్ల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కరోనా వైరస్ రూపం మార్చుకున్నా వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. అమెరికా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలియా శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకలపై ప్రయోగాలు చేయగా ఆ […]

Written By: Navya, Updated On : June 24, 2021 1:19 pm
Follow us on


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుతోంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా కరోనా కొత్త వేరియంట్ల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కరోనా వైరస్ రూపం మార్చుకున్నా వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. అమెరికా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలియా శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నారు.

శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకలపై ప్రయోగాలు చేయగా ఆ ప్రయోగాలు విజయవంతం కావడం గమనార్హం. సైన్స్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఎం.ఆర్.ఎన్.ఏ కోడ్ పై దృష్టి పెట్టి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు చేయడం గమనార్హం. ఫైజర్, మోడెర్నా కంపెనీలు ఇప్పటికే ఒక వైరస్ ఎం.ఆర్.ఎన్.ఏ కోడ్ ఆధారిత వ్యాక్సిన్లను తయారు చేశాయి.

ఫైజర్, మోడెర్నా కంపెనీలు ఇప్పటికే ఒక వైరస్ ఎం.ఆర్.ఎన్.ఏ ఆధారిత వ్యాక్సిన్లను తయారు చేశాయి. ఈ ఫార్ములాతో శాస్త్రవేత్తలు పలు రకాల కరోనా వైరస్ ల యొక్క ఎం.ఆర్.ఎన్.ఏలను జత చేసి వ్యాక్సిన్లను అద్భివృద్ధి చేశాయి. ఈ హైబ్రిడ్ వ్యాక్సిన్ ను ఇప్పటికే ఎలుకలకు ఇవ్వగా ఎలుకల్లో విభిన్న రకాల స్పైక్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ వాటిలో ఉత్పత్తి కావడం గమనార్హం.

ఈ వ్యాక్సిన్ ఎలుకల్లో ప్రవేశపెట్టిన కరోనా వైరస్ ను అడ్డుకోవడంతో పాటు ఊపిరితిత్తులకు రక్షణ కల్పించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగిస్తామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.