Hyundai Car: దేశీయ కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు ఆకట్టుకున్నాయి. దీని నుంచి వచ్చిన క్రెటాయ్ వినియోగదారులను ఇంప్రెస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు క్రెటాయ్ ని ‘క్రెటాయ్ ఎన్ లైన్’ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఇది రిలీజ్ కావడానికి కాస్త సమయం తీసుకున్నా.. త్వరలోనే బుకింగ్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ‘క్రెటాయ్ ఎన్ లైన్ ’ గురించి తీవ్ర చర్చ సాగుతోంది. అసలు ఈ కారు ఎలా ఉంటుందో ఒకసారి వివరాల్లోకి వెళ్తాం..
హ్యుందాయ్ క్రెటాయ్ కారును చూస్తే కారు వినియోగదారులు తప్పకుండా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలను భట్టి చూస్తే.. ఇది 1.5 లీటర్ పెట్రోల్ 4 సిలిండర్ టర్బో ఇంజిన్ ను కలిగి ఉంది. 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ తో పాటు అదనంగా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కూడా పొందవచ్చు. ఇది 160 హర్స్ పవర్ బీహెచ్ పీ ని కలిగి 253 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనుంది.
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ మిడ్ సైజ్ ఎస్ యూవీ అయినప్పటికీ ఇది కియా సెల్టోస్ ఎక్స్ లైన్, స్కోడా కుషాక్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక కొత్త క్రెటా ఎన్ లైన్ డిజైన్ ఆకర్షణీయంగా ఉండే అవకాశంకనిపిస్తోంది. దీని ముందు బాగాంలో గ్రిల్, యాంగ్యులర్ కట్స్, విశాలమైన ఎయిర్ ఇన్ లెట్ లు, ఎలిమెంట్ కలిగి సరికొత్త బంపర్ ను కలిగి ఉంటుంది. దీనికి ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్, డీఆర్ఎల్ వంటికి ఆకర్షించే అవకాశం ఉంది.
ఈ మోడల్ ను మార్చి 11 తరువాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ అంతకంటే ముందే దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ గురించి తెలిసి ఇంప్రెస్ అవుతున్నారు. క్రెటా ఎన్ లైన్ రక్షణ విషయంలో కూడా కేర్ తీసుకునే అవకాశం ఉంది. దీని వెనుక వైపు పెద్ద రూప్ మౌంటెడ్ స్పాయిలర్, డిప్యూజర్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ టిప్స్ టెంపర్ ఆకర్షించనున్నాయి. ఇవన్నీ చూడ్డానికి ఆకర్షించడమే కాకుండా భద్రతను ఇస్తాయని అంటున్నారు.