Rent House Vs Buy House:ఇల్లు కట్టుకోవాలన్నది కొంతమంది కల.. కానీ దీనికి సరైన మూలధనం లేఖ ఆ కలను కొంతమంది నెరవేర్చుకోలేరు. కానీ కొందరు మాత్రం రుణ సాయంతోనైనా ఇల్లు కట్టాలని అనుకుంటారు. సొంత ఇంట్లోఏం చేసినా అడిగేవారు ఎవరూ ఉండరని, సొంత ఇంట్లో ఉన్న సుఖం ఎక్కడా దొరకదు అని కొందరి అభిప్రాయం. అయితే కొందరు ఆర్థిక నిపుణులు మాత్రం సొంత ఇల్లు కోసం ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇదే సమయంలో సొంత ఇల్లు కోసం పెట్టే పెట్టుబడి కన్నా మిగతా వాటిలో ఇన్వెస్టు మెంట్ చేస్తే సొంత ఇల్లు కంటే ఎక్కువ లాభాలు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సొంత ఇల్లు బెటరా? లేక అద్దె ఇంట్లోనే ఉండడం బెస్టా? అని చాలా మందికి సందేహం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో కొందరు నిపుణుల ఏం తేల్చారంటే?
కొంత మంది ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో రుణ సాయం తీసుకుంటారు. అయితే తమ స్థాయికి మించి అప్పులు చేస్తారు. ఇలా ఇల్లుకు అయిన అప్పులను తీర్చలేక చాలా మంది కట్టిన ఇల్లును తిరిగి అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోకుండా ఉండడమే మంచిదని కొందరి నిపుణుల అభప్రాయం. ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారు 50 శాతం చేతిలో నగదు ఉండి..మరో 50 శాతం అప్పు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవి అంటున్నారు. కానీ అంతకు మంచి రుణ సాయం తీసుకున్నా జీవితాంతం ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇక అద్దె ఇంట్లో ఉన్నవారు కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అద్దె ఇంట్లో ఉండడం వల్ల ఓనర్ తో ఇబ్బందులు ఉంటాయని, అలాగే ఉద్యోగం ఉన్నా.. లేకపోయినా.. నెల నెలా అద్దె తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సొంత ఇంట్లో అయితే అద్దె సమస్య ఉండదు. ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. అలాగే చీటికి మాటికి ఓనర్ తో మాటలు పడాల్సి వస్తుందని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
అయితే మొత్తంగా అద్దె ఇల్లు బెటరా? లేక సొంత ఇల్లు మంచిదా? అన్న సందేహం వ్యక్తమవుతున్న తరుణంలో కొందరు సొంత ఇల్లు కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. చేతిలో డబ్బు ఉండి ఇల్లు కట్టుకోవాలనుకోవడం మంచిదే. కానీ ఇంటి కోసం ప్రత్యేకంగా అప్పులు చేసి తిప్పలు పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే చేతిలో కొంత డబ్బు ఉండి.. దానిని ఇంటికోసం పెట్టుబడి పెట్టే కంటే ఇతర ఇన్వెస్టు మెంట్ చేయడం వల్ల పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతాయని అంటున్నారు. ఇంటి కోసం చేసిన అప్పు జీవితాంతమైనా పూర్తి కాదని అంటున్నారు