Niveditha: ప్రేమించుకోవడం.. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం.. బేధాభిప్రాయాలు ఏర్పడి విడిపోవడం.. నిన్నటి వరకు సినీ తారల విషయంలోనే మనం చూసాం. ఈ జాబితాలో బుల్లితెర నటులు కూడా చేరారు. అందులో బుల్లితెర నటి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని.. కొంతకాలానికే విడాకులు తీసుకుంది. అయితే ఆ నటి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
నివేదిత పంకజ్… తమిళ సీరియల్స్ లో ఎక్కువగా నటిస్తుంది. ఈమె నటించిన తిరుమల అనే సీరియల్ అక్కడ బహుళ ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఎస్ ఎస్ ఆర్యన్ అనే నటుడిని ప్రేమించింది. అంతకాలం తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం భేదాభిప్రాయాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. నివేదితతో విడాకులైన తర్వాత ఆర్యన్ బుల్లితెర నటి శ్రీతిక సనీష్ ను చేసుకున్నాడు. విడాకులు అనంతరం కొద్ది రోజులు ఇబ్బంది పడిన నివేదిత.. ఇప్పుడు తను కూడా ఒక కొత్త తోడు వెతుకుంది. సహచర బుల్లితెర నటుడు పంకజ్ ను రెండో వివాహం చేసుకుంది. పంకజ్ తో కొంతకాలం ప్రేమలో ఉన్న నివేదిత.. కుటుంబ సభ్యులకు చెప్పి రెండో పెళ్లి చేసుకుంది.
పంకజ్, నివేదిత వివాహం ఫిబ్రవరి 23, శుక్రవారం నాడు చెన్నైలోని ఓ రిసార్ట్లో జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు, బుల్లితెర నటులు హాజరయ్యారు. వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. “నీ వెంట కలకాలం ఉంటాను. నీ చేయిని ఎప్పటికీ వదలను. ఐ లవ్ యు” అంటూ పంకజ్ తన ప్రేమను వ్యక్తం చేయడంతో నివేదిత కన్నీటి పర్యంతమైంది. పెళ్లి వేదిక మీదనే ఏడ్చేసింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పిల్లా పాపలతో కలకాలం జీవించాలని ఆశీర్వదిస్తున్నారు.