Hyundai Aura vs Maruti Dzire: మార్కెట్లోకి ఎన్నో రకాల కార్లు వస్తుంటాయి. కానీ కొందరు వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండే సెడాన్ కార్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. సొంత అవసరాలతో పాటు కార్యాలయాలకు వెళ్లడానికి ఈ కారు కాంపాక్ట్ SUV గా ఉంటూ వినియోగదారులకు సౌకర్యాలను అందిస్తుంది. ఈ విభాగంలో ఇప్పటివరకు మారుతి సుజుకి కంపెనీకి చెందిన Dzire గురించే మాట్లాడుకునేవారు. అయితే ఈ కారుకు కట్టి పోటీ ఇవ్వడానికి Hyundai రెడీ అవుతుంది. దీనికి చెందిన ఓ కారు ఇటీవల మెల్లగా అమ్మకాలు పెంచుకుంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ కారు అమ్మకాలు పెరగడంతో సెడాన్ విభాగంలో మరో కారు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ కారు ఏది? దానిలో ఉండే ఫీచర్స్ ఏంటి?
దేశంలో SUV కార్లను అందించడంలో Hyundai కంపెనీ ప్రత్యేకత చాటుకుంటుంది. అయితే సెడాన్ విభాగంలోనూ తన గుర్తింపును చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీ నుంచి 2020 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన Aura అనే మోడల్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది. దీని అమ్మకాలు ఫిబ్రవరి 2026 లో 6,733 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 4,797 కార్ల సేల్స్ జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 40 శాతం వరకు వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. సెడాన్ విభాగంలో ఇప్పటివరకు మారుతి సుజుకి డిజైర్ వైపు మాత్రమే చూసినవారు ఇప్పుడు హుందాయి ఆరా కారు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ నేటి వారిని ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 83 హార్స్ పవర్ ను అందించగా.. 113.8 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ తో పాటు ఇందులో CNG ఆప్షన్ కూడా ఉండడంతో మైలేజ్ విషయంలో ఇది బెస్ట్ కారుగా నిలుస్తుంది. ఈ రెండు ఇంజన్లు కలిపి 28 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే స్మార్ట్ ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నైన్ అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్లెస్ చార్జింగ్, ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం ABS తోపాటు ESC సపోర్ట్ గా నిలుస్తున్నాయి. అలాగే వాయిస్ రికగ్నిషన్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి కూడా సౌకర్యాన్ని అందిస్తాయి.
ఈ కారును రూ. 6 లక్షల నుంచి 8.54 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ కొత్తగా కారు కొనాలని అనుకునేవారు.. ఇంధన పొదుపు సేవ్ చేయాలని అనుకునేవారు.. దీనిని ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.