Hero : భారతీయ వినియోగదారుల్లో హీరో మోటార్‌సైకిళ్లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత నెల అంటే ఫిబ్రవరి 2025లో హీరో స్ప్లెండర్‌ను 2 లక్షల మందికి పైగా కొత్త వినియోగదారులు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా, హీరో ఇతర మోడళ్లు కూడా బాగానే అమ్ముడయ్యాయి. అయితే, అదే సమయంలో కంపెనీ ఓ పవర్ ఫుల్ మోడల్ హీరో కరిజ్మా 210కి మాత్రం నిరాశే ఎదురైంది. ఫిబ్రవరి నెలలో కరిజ్మా 210ని ఒక్క కస్టమర్ కూడా కొనుగోలు చేయలేదు. అయితే సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే ఫిబ్రవరి 2024లో కరిజ్మా 210ని మొత్తం 2,128 మంది కొనుగోలు చేశారు. హీరో ఈ మోటార్‌సైకిల్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read : 7 సీటర్లో బెస్ట్ సేఫ్టీ కార్లు ఏవో తెలుసా?
కరిజ్మా 210 ఫీచర్లు ఇలా ఉన్నాయి
ఫీచర్ల విషయానికి వస్తే.. హీరో కరిజ్మా 210 బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సిడి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు డిస్క్ బ్రేక్ మరియ, వెనుక డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంది. అదనంగా, బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS కూడా అందించబడింది. మరోవైపు బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్సార్బర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.
బైక్ ధర ఎంతంటే…
మరోవైపు హీరో కరిజ్మా 210 210సీసీ 4V లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 25.5bhp పవర్, 20.4Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మరోవైపు బైక్ ఐకానిక్ ఎల్లో, మెటల్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్‌లో హీరో కరిజ్మా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.90 లక్షల నుంచి టాప్ మోడల్‌లో రూ. 2.10 లక్షల వరకు ఉంటుంది.
Also Read : కేవలం రూ.3 వేలకే టీవీఎస్ బైక్.. ఆఫీసుకు వెళ్లడానికి బెస్ట్ ఇదే