7-Seater Cars : కారు కొనుగోలు చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ కారును కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల అనేక రైతు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాల సమయంలో కొన్ని కార్లు ప్రయాణికులను కాపాడుతూ ఉంటాయి. మరికొన్ని కార్లు మాత్రం చిన్న యాక్సిడెంట్ కే భారీగా ధ్వంసం అవుతాయి. ఇలాంటి సమయంలో సేఫ్టీ గా ఉండే కారులను తీసుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా రక్షణను దృష్టిలో ఉంచుకొని కారని ఉత్పత్తి చేస్తాయి. అయితే సెవెన్ సీటర్లో మంచి రక్షణ ఇచ్చే కార్లు ఏవో తెలుసుకుందాం..
Also Read : ఏప్రిల్ 1నుంచి కార్ల ధరలు పెరగుతుంటే.. ఈ 7సీటర్ మాత్రం భారీగా తగ్గింది
ఈమధ్య 7 సీటర్ కార్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే సమయంలో ఇవి సేఫ్టీ గా ఉన్నాయా? లేదా? అని కూడా చూస్తున్నారు. కారు మైలేజీ, ధర కంటే సేఫ్టీ ముఖ్యమని చాలా మంది భావిస్తారు. అయితే టాటా కంపెనీకి చెందిన HARRIER బెస్ట్ సేఫ్టీగా పేరు తెచ్చుకుంది. ఈ కారులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వీటిలో 6 ఎయిర్ బ్యాగ్స్ కాంటాక్ట్ ను కలిగి ఉన్నాయి. కొన్ని ప్రమాదాల్లో ఇవి అత్యంత సేఫ్టీని ఇస్తాయి. గ్లోబల్ NCAP, భారత్ NCAP లో ఈ కారు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ను పొందింది. అలాగే ఇందులో లెవెల్ టు అడాస్ సిస్టం తో పాటు రియార్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా తో పాటు అను రమిక్ సన్ రూమ్ ఆప్షన్ ను ఇందులో అమర్చారు. ఈ కారు ధారా ప్రస్తుతం మార్కెట్లో రూ రూ 24.35 లక్షల ప్రారంభ ధర నుంచి 26.5 లక్షల వరకు ఉంది.
సెవెన్ సీటర్ సేఫ్టీ లో మరో కారు TATA SAFARI గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సేఫ్టీ లో ఈ కారు ఫైవ్ స్టార్ రేటింగ్ను పొందింది. అలాగే లెవెల్ టు అడాస్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ కారులో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో పాటు యూఎస్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్, వైర్లెస్ చార్జర్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సౌండ్ కోసం టెన్ స్పీకర్స్ అమర్చారు. ఈ కారు ధర మార్కెట్లో రూ. 23.85 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 26.5 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
Toyota కంపెనీకి చెందిన Crysta అనే కారు బెస్ట్ సేఫ్టీ సెవెన్ సీటర్ గా పేరు తెచ్చుకుంది. ఇందులో సెవెన్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, స్థిర కంట్రోల్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ కారులో 2.4 లీటర్ డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. దీనిని మార్కెట్లో రూ 25.14 లక్షల ప్రారంభ ధర నుంచి 2.26.8 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
Also Read : దేశంలో అతి తక్కువ ధరకు లభించే CNG కార్లు ఇవే..